Yuddhame Raani song: యూత్‌కి కనెక్ట్ అవుతుంది
ABN , Publish Date - Jul 27 , 2025 | 02:40 AM
డార్లింగ్ కృష్ణ, మనీషా జంటగా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న బహు భాషా చిత్రం ‘బ్రాట్’. డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై మంజునాథ్ కంద్కూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి...
డార్లింగ్ కృష్ణ, మనీషా జంటగా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న బహు భాషా చిత్రం ‘బ్రాట్’. డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై మంజునాథ్ కంద్కూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘యుద్ధమే రాని...’ అంటూ సాగే పాటను సీనియర్ నటుడు నరేశ్ వీకే విడుదల చేశారు. ఈ పాటను సనారె రాయగా, అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ కార్యక్రమంలో నరేశ్ వీకే మాట్లాడుతూ ‘మంజునాథ్ చాలా రోజుల తరవాత అద్భుతమైన సినిమా ‘బ్రాట్’తో వస్తున్నారు. శశాంక్ చాలా నైపుణ్యమున్న దర్శకుడు. మనీషా అద్భుతమైన నటి. యువతకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు. చిత్ర దర్శకుడు శశాంక్ మాట్లాడుతూ ‘అందరినీ మెప్పించే కథ ఇది’ అని అన్నారు.
Sunday Tv Movies: ఆదివారం, జూలై 27న.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
Deviyani Sharma: అందాలను ఈ రేంజ్ లో ఆరబోస్తున్నా పట్టించుకోరేంటయ్యా