సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Brahmanandam: మాజీమంత్రి ఎర్రబెల్లికి ఫోటో ఇవ్వనన్న బ్రహ్మీ.. అసలు విషయం ఏంటంటే

ABN, Publish Date - Nov 23 , 2025 | 08:44 PM

వివాదాలకు ఆమడ దూరంలో ఉండే బ్రహ్మానందం(Brahmanandam) తాజాగా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. గతరాత్రి నుంచి సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ రావడం మొదలయ్యాయి.

Brahmanandam

Brahmanandam: వివాదాలకు ఆమడ దూరంలో ఉండే బ్రహ్మానందం(Brahmanandam) తాజాగా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. గతరాత్రి నుంచి సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ రావడం మొదలయ్యాయి. అసలు ఏమైందంటే.. గతరాత్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)కి ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి కావడంతో ఆయన కుమారుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఒక పెద్ద ఈవెంట్ ను నిర్వహించాడు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు అంతా హాజరయ్యారు. ఇక బ్రహ్మానందంకు మోహన్ బాబు కు ఉన్న స్నేహం ఎలాంటిదో అందరికీ తెల్సిందే. బయటకు వస్తే బ్రహ్మీ ఏ రేంజ్ లో కామెడీ చేస్తాడో కూడా అందరికీ తెలుసు. ఈ వేడుకలో కూడా అదే జరిగింది.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక వేడుకలో బ్రహ్మానందం వెళ్తుండగా.. ఎర్రబెల్లి ఫోటో దిగుదాం రండి అని బ్రహ్మీని అడగ్గా .. ఆయన వద్దండి అని తిరస్కరించారు. అయితే ఎర్రబెల్లి.. బ్రహ్మీ చెయ్యిపట్టుకోని మరోసారి రమ్మని అడగ్గా .. బ్రహ్మీ చెయ్యి విదిలించుకుని వెళ్లిపోవడం.. ఎర్రబెల్లి ముఖం ఎర్రబడడం వీడియోలో కనిపించింది. ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. కొందరు బ్రహ్మీపై ట్రోల్ కూడా చేశారు.

ఇక ఈ ట్రోల్స్ పై, ఆ ఘటనపై బ్రహ్మీ స్పందించాడు. ఎర్రబెల్లితో తన స్నేహం 30 ఏళ్ళ నాటిది అని, ఆయనతో ఉన్న చనువుతో అలా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ' అందరికీ నమస్కారం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక వీడియో చూసి నవ్వుకున్నాను. మోహన్ బాబు ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు, లేట్ అయ్యిందని నేను హడావిడిగా వెళ్తున్నాను. అంతలోనే దయా అన్న ఎదురయ్యాడు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నాకా రా అన్నా ఫోటో తీసుకుందాం అని అన్నాడు. వద్దండి.. ఫోటో వద్దు ఏం వద్దు అని లోపలి వెళ్ళిపోయాను.

దాన్ని కొంతమంది మిత్రులు అపార్థం చేసుకొని ఏదేదో అనుకుంటున్నారు. దయాకర్ తోటి నాకు 30 ఏళ్ళ సంబంధం ఉంది. మంచి మిత్రులం. చాలా మాట్లాడుకున్నాం. అటువంటింది. ఆయనతో ఉన్న చనువు కొద్దీ.. ఉండండి.. అని పక్కకి ఇలా అంటే.. దానిని నేనేది కావాలని తోసిన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఉదయమే దయా అన్నా కూడా కాల్ చేసి మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూసి నవ్వుకున్నాం ఈ విషయాన్నీ అందరూ ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని.. క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేశాను'

Updated Date - Nov 23 , 2025 | 08:44 PM