సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishnupriya: మరింత ఘాటుగా టాప్ లేపిన విష్ణుప్రియ..

ABN, Publish Date - Jun 27 , 2025 | 10:14 PM

పోవే పోరా షో ద్వారా యాంకర్ విష్ణుప్రియ (Vishnupriya) మంచి గుర్తింపును అందుకుంది.

Vishnupriya

Vishnupriya: పోవే పోరా షో ద్వారా యాంకర్ విష్ణుప్రియ (Vishnupriya) మంచి గుర్తింపును అందుకుంది. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), రష్మీ ( Rashmi) తరువాత విష్ణునే మంచి జోడీ అని పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత విష్ణు నెమ్మది నెమ్మదిగా స్టార్ గా మారింది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకోపక్క సోషల్ మీడియాలో అందాలను అరబోయడంతో అమ్మడు త్వరగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే సినిమాల్లో కీలక పాత్రలు చేయడం మొదలుపెట్టింది. ఇక అదే గుర్తింపుతో గత సీజన్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా మారింది.


బిగ్ బాస్ లోకి వెళ్ళాక కానీ, అమ్మడి గుట్టు బయటపడలేదు. ఏదో ఆడేసి రచ్చ చేస్తుందేమో అనుకుంటే.. పృథ్వీ శెట్టితో పులిహోర కలిపి.. స్నేహం, ప్రేమ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత అదంతా తూచ్ మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే.. అని చెప్పుకొచ్చి జనాలను పిచ్చోళ్లను చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా కూడా విష్ణు- పృథ్వీల జంటను షో యాజమాన్యం బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. వీరిద్దరూ జంటగా వస్తే రేటింగ్ పెరుగుతుందని అలానే తీసుకురావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం విష్ణు.. కుక్ విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంటుంది.


ఇవన్నీ పక్కన పెడితే.. విష్ణుకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పొచ్చు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ గ్లామర్ పాత్రలకు సైతం సై అనే విధంగా హింట్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫ్రెండ్స్ తోనో, చెల్లితోనో వెకేషన్స్ కు వెళ్లి బీచ్ ఒడ్డున బికినీలో, ఎద అందాలను ఎరగా వేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


తాజాగా విష్ణు శ్రీలంక డైరీస్ అంటూ కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. ఇక శ్రీలంక ట్రిప్ లో ఆమె గడిపిన రోజులను ఒక ఫోటో డంప్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలలో అమ్మడి గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా వైట్ కలర్ షర్ట్ ను వెనక్కి నెట్టి క్రాప్ టాప్ లో క్లివేజ్ షో చేస్తూ పిచ్చెక్కించింది. ఇక ఎద అందాలను ఆరబోస్తూ అమ్మడు మరింత హాట్ గా కనిపించింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా సోల్ థెరపీ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Akhil Akkineni: నా జీవితంలో అత్యుత్తమ రోజు..

Updated Date - Jun 27 , 2025 | 10:14 PM