సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Biggboss 9: బిగ్‌బాస్‌ టైమ్‌ మారిపోయింది.. ఎందుకంటే..

ABN, Publish Date - Dec 05 , 2025 | 11:37 AM

బిగ్‌బాస్‌ సీజన్‌-9 (Biggboss 9) ఫినాలేకు దగ్గర్లో ఉంది. మరో రెండు వారాల్లో గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. బిగ్‌బాస్‌ షోకి చిన్న షాక్‌ ఇచ్చారు.

Bigg Boss Season 9

బిగ్‌బాస్‌ సీజన్‌-9 (Biggboss 9) ఫినాలేకు దగ్గర్లో ఉంది. మరో రెండు వారాల్లో గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. ప్రారంభంలో తూతూ మంత్రంగా నడిచినా ఇప్పుడు మాత్రం బాగానే సాగుతోంది. రేటింగ్‌ కూడా ట్రాక్‌లోకి వచ్చింది. తనూజ, కళ్యాణ్‌ మధ్య విన్నర్‌ ఎవరూ అంటూ గట్టిగానే చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో బిగ్‌బాస్‌ షోకి చిన్న షాక్‌ ఇచ్చారు. ‘స్టార్‌ మా’ (Star maa) బిగ్‌బాస్‌ షో టైమింగ్స్‌ మార్చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకి స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ షో ప్రసారమవుతుంది. శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకే టెలికాస్ట్‌ అవుతుంది.

అయితే డిసెంబర్‌ 8 నుంచి మాత్రం ఈ టైమింగ్స్‌ మారబోతున్నాయి. ఇక నుంచి బిగ్‌బాస్‌ రాత్రి 10 గంటలకి ప్రసారం కానుంది. సోమవారం - శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకి స్టార్‌లో మాలో టెలికాస్ట్‌ అవుతుంది. వీకెండ్‌ మాత్రం ఎప్పటిలానే రాత్రి 9 గంటలకే ప్రసారం అవుతుంది. ఇంతకీ ఈ మార్పుకు కారణం స్టార్‌ మాలో రానున్న కొత్త సీరియల్‌. డిసెంబర్‌ 8 నుంచి ‘పొదరిల్ల్లు’ అనే కొత్త సీరియల్‌ రాబోతుంది. ఇది సోమవారంనుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకి ప్రసారం కానుంది. ఈ సీరియల్ కోసమే బిగ్‌బాస్‌ షోను అరగంట వాయిదా వేశారు.

Updated Date - Dec 05 , 2025 | 12:50 PM