సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg Boss Telugu9: బిగ్ బాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మోడ్‌.. ట్విస్టులు, టాస్కులు, సర్ప్రైజ్ ఎంట్రీలు

ABN, Publish Date - Oct 24 , 2025 | 08:02 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 46వ రోజు నవ్వులు, గొడవలు, సర్ప్రైజ్‌లతో ప్రేక్షకులను అలరించింది. ఫన్నీ టాస్కులు, పోలీస్ ఎంట్రీ, సంజన దివ్య మధ్య మాటల ఘర్షణ all in one ఎపిసోడ్‌గా సాగింది.

Bigg Boss Telugu9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) ఆప్ర‌తిహాతంగా సాగుతూ విజ‌య‌వంతంగా 46వ రోజు పూర్తి చేసుకుంది. గురువారం ఏపిసోడ్ ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన వాటిక‌న్నా పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంద‌డిగా గడిచింది. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ హౌస్‌లో నవ్వులు, గొడవలు, పోలీస్ డ్రామా అంతా ఆల్ ఇన్ వ‌న్‌గా సాగింది. ఎపిసోడ్ ప్రారంభం నుంచే డస్ట్ బిన్ ఇష్యూపై సంజన, దివ్య మధ్య మాటల ఘర్షణ నెలకొంది. చెత్త సమయానికి క్లిన్ చేయలేదని సంజన ఆగ్రహించగా, దివ్య “ఇలాంటి చిన్న తప్పులు జరుగుతుంటాయి, సహనం ఉండాలి” అంటూ సమాధానం ఇచ్చింది. అయితే దివ్య “నేను అన్ని పనుల్లో దృష్టి పెడితే తప్పులు బయటపడతాయి” అని కాస్త హీట్‌గా రియాక్ట్ కావడంతో సన్నివేశం టెన్షన్‌గా మారింది.

తర్వాత బిగ్ బాస్ ఫన్నీ టాస్క్‌ను ప్రకటించారు. నీళ్లు నింపుకో.. టార్గెట్‌ హిట్‌ చేయి!” అనే గేమ్‌లో సంజన నేతృత్వంలోని బ్లూ టీం, మాధురి లీడ్ చేస్తున్న రెడ్ టీం తలపడ్డాయి. కంటెస్టెంట్లు నోటిలో నీళ్లు నింపుకుని బకెట్‌లోకి ఊయాలి. దూరంగా ఉన్న బకెట్‌లో ఎవరు ఎక్కువ నీళ్లు వేసితే వారు విజేతలు. మొదటి రౌండ్‌లో బ్లూ టీం నుంచి ఆయేషా, రెడ్ టీం నుంచి రీతూ పోటీ పడ్డారు. ఇటీవల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డప్పటికీ, “ఇప్పుడు పూర్తిగా బాగున్నాను” అంటూ ఆయేషా గేమ్‌లో పాల్గొంది. అద్భుత ప్రదర్శనతో రీతూపై విజయం సాధించి టీంకి లీడ్ అందించింది. వరుస విజయాలతో బ్లూ టీం మొత్తం టాస్క్‌లో గెలిచి ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంది.

ఓడిపోయిన మాధురి టీంకు బిగ్ బాస్ సరదా శిక్ష విధించారు మోకాళ్లపై నిలబడి సంజన టీంను పొగడాలి! ఈ పన్నిష్‌మెంట్‌తో హౌస్‌లో నవ్వులు పూశాయి. ఎపిసోడ్ క్లైమాక్స్‌కి రాగానే బిగ్ బాస్ సర్ప్రైజ్ గెస్ట్ ఎంట్రీ ప్లాన్ చేశారు. మాజీ కంటెస్టెంట్లు అర్జున్ అంబటి, అమర్ దీప్ పోలీస్ గెటప్‌లలో హౌస్‌లోకి ప్రవేశించి ఫన్‌ను రెట్టింపు చేశారు. వారి టాస్క్ మారు వేషాల్లో ఉన్న సంజన, మాధురిలను పట్టుకోవడం. ఇద్దరూ తమ కామెడీ స్టైల్‌లో కంటెస్టెంట్లను ఎంక్వైరీ చేస్తూ మొత్తం హౌస్‌ను నవ్వులతో నింపేశారు. చివరికి వారు సులభంగా టాస్క్‌ను పూర్తి చేశారు.

Updated Date - Oct 24 , 2025 | 08:30 AM