Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్.. రచ్చరంబోలా! ఒకరిని మించి మరొకరు
ABN, Publish Date - Oct 21 , 2025 | 08:12 AM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 43వ రోజు నామినేషన్స్ రౌండ్ ఘర్షణలు, ఆరోపణలతో నిండిపోయింది. అయేషా–రీతూ వాగ్వాదం హౌస్‌లో హీటెక్కించింది!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) 43వ రోజు నామినేషన్స్ ఎపిసోడ్ రచ్చ రంబోలా అవతారం దాల్చింది. హౌస్‌లో ఘర్షణలు, ఆరోపణలు, కౌంటర్లతో పూర్తిగా కొత్త టర్న్ తీసుకుంది. ఇందుకు ప్రధాన కారణం బిగ్ బాస్ ఈసారి నామినేషన్ టాస్క్‌ని సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేయడమే.
బెలూన్లతో.. నామినేషన్స్ టాస్క్
బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, అయేషాలకి స్పెషల్ టాస్క్ ఇచ్చారు. హౌస్ అంతా వందల బెలూన్లు ఉంచి, వాటిని పగలగొట్టినప్పుడు వచ్చే చీటీల ద్వారా నామినేషన్ ప్రాసెస్ కొనసాగించమన్నారు. ప్రతి చీటీ ఒక నామినేషన్ హక్కుగా ఉండగా, అయేషా వద్దకు డైరెక్ట్ నామినేషన్ చీటీ రావడంతో, ఆమె రీతూని నామినేట్ చేసింది.
అయేషా vs రీతూ ఘర్షణ
“రీతూ బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ ఆడటానికి కాదు, లవ్ ట్రాక్ నడపడానికి మాత్రమే వచ్చింది. కెమెరా అటెన్షన్ కోసం డ్రామాలు చేస్తుంది” అంటూ అయేషా నిప్పులు చెరిగేలా వ్యాఖ్యలు చేసింది. దీని మీద రీతూ కూడా చెలరేగి, తిరిగి అయేషాని నామినేట్ చేస్తూ కౌంటర్ ఇచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది.
దివ్య, సాయి కౌంటర్లు
దివ్య.. అయేషా, సాయిలను నామినేట్ చేస్తూ ఫైర్ అయ్యింది. సాయి కూడా వెనుకడుగు వేయకుండా “ఈ హౌస్‌లో ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుందంటావా? భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యాడు” అంటూ దివ్యపై బాణం సంధించాడు. ఈ మాటలు హౌస్‌లో గట్టిగానే పేలాయి.
ఫేక్ అంటూ విమర్శలు
రీతూ.. హౌస్‌లో రాము కనిపించడంలేదు, ఫేక్‌గా ఆడుతున్నాడు అంటూ నామినేట్ చేసింది. ఇక రమ్య మోక్ష కూడా తనూజపై దాడి చేస్తూ..తనూజ నటిస్తోంది, ఆమె ఫేక్. గేమ్‌లో నటనతో మోసం చేస్తోంది” అని వ్యాఖ్యానించింది.
ఇమ్మాన్యుయేల్ అసహనం
కళ్యాణ్.. సంజనని నామినేట్ చేయడంతో ఇమ్మాన్యుయేల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనూజని నామినేట్ చేయమని చీటీ ఇచ్చాను, కానీ సంజనని ఎంచుకోవడం బాధగా అనిపించింది అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
గౌరవ్ స్పెషల్ పవర్
బిగ్ బాస్ ఈ వారం గౌరవ్‌కు స్పెషల్ పవర్ ఇచ్చి, నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమనగా. గౌరవ్ అయేషాని రక్షించాడు.
ఈ వారం నామినేట్ అయిన హౌస్‌మేట్స్
రీతూ, సాయి, రాము, కళ్యాణ్, సంజన, దివ్య మొత్తంగా ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. హౌస్‌లో ప్రతి ఒక్కరు మరొకరిపై ఆరోపణలు పత్యారోపణలతో ఒక్కసారిగా హస్ హీట్ ఎక్కిన నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ ఏ దరి చేరుతుందో.. ఎవరు ఇంటి మార్గం పడుతారో అనే వారి వారి ఫాలోవర్స్‌లో కొత్త డౌటనుమానాలు ప్రారంభమయ్యాయి.