సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg Boss Season 9: ఇలా అయితే.. 100 రోజులు న‌డిపేదెలా

ABN, Publish Date - Sep 15 , 2025 | 12:57 PM

బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో హంగామాగా ప్రారంభమైనప్పటికీ, మొదటి వారంలోనే ప్రేక్షకులు “బాబోయ్!” అనుకునేలా మారింది.

Bigg Boss Season 9

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) ఎంతో హంగామాగా ప్రారంభమైనప్పటికీ, మొదటి వారంలోనే ప్రేక్షకులు “బాబోయ్!” అనుకునేలా మారింది. ప్రతి సీజన్‌లో ప్రత్యేకంగా ఏదో కొత్త కాన్సెప్ట్ ఇవ్వడం బిగ్ బాస్‌కు అలవాటు. కానీ ఈసారి కామనర్స్‌ని ఎంపిక చేసిన విధానం వల్లనే అది “అగ్నిపరీక్ష”లా మారింది. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిర్వహించిన పరీక్షల ద్వారా 13 మంది కామనర్స్‌ను ఫైనల్ చేసి, ఆడియన్స్ ఓటింగ్‌తో ముగ్గురిని, జడ్జిల ఎంపికతో మరో ముగ్గురిని హౌస్‌లోకి పంపించారు.

అయితే.. ఈ సీజన్‌లో కామనర్స్‌ని ఓనర్స్‌గా నిలబెట్టగా, సెలబ్రిటీ కంటెస్టెంట్లు టెనంట్స్‌గా ఉన్నారు. ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ టాస్కులు హౌస్‌లో వేడిని పెంచుతున్నాయి. అయితే మొదటి వారం ముగిసేలోపే కామనర్స్ అతిగా ప్రవర్తించడం ప్రేక్షకులను అసహనానికి గురిచేసింది.

హోస్ట్ నాగార్జున స్వయంగా కామనర్స్ ప్రవర్తనపై స్పందిస్తూ, “వాళ్లు సెట్ చేస్తున్నారంటూ” చెప్పడంతో హౌస్‌లో గందరగోళం పెరిగింది. ముఖ్యంగా మాస్క్ మ్యాన్‌గా వచ్చిన హరీష్ తన నిర్ణయాలపై అట్టడుగు స్థాయిలో కూడా వినేలా కనిపించకపోవడం ప్రేక్షకుల్లో అసహనాన్ని పెంచింది.

అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన మనీష్, ప్రియ, శ్రీజ, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల లాంటి కామనర్స్ హౌస్‌కు సరైన కంటెంట్ ఇవ్వట్లేదని కామెంట్‌లు వస్తున్నాయి. జడ్జిలుగా ఉన్న అభిజిత్, నవదీప్, బిందుమాధవి, శ్రీముఖి ఈ ఆరుగురిని ఎంపిక చేసినా, మొదటి వారంలోనే వాళ్ల ఆట ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

సెలబ్రిటీ కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో కూడా పెద్దగా ఆకట్టుకునే వ్యక్తిత్వాలు లేవనే భావన బలపడుతోంది. సీరియల్ బ్యాచ్‌గా వచ్చిన తనూజ, భరణి ఏం ప్రత్యేకంగా కనిపించడం లేదు. రీతు చౌదరి, ఇమ్మాన్యుయెల్ వంటి సెలబ్రిటీలను తీసుకున్నా వారి నుంచి సరైన కంటెంట్ లేదు. ఒ్వేల ఉన్నా చూపించ‌డం లేదా అన ఏఅనుమానాలు వ‌స్తున్నాయి. రాము రాథోడ్, సుమన్ శెట్టిల పనితీరు కూడా నిరాశగా ఉంది. సంజన ఎప్పుడూ అరుస్తూ ఉండటం, ఫ్లోరా షైనీ హౌస్‌లో ఎందుకు ఉన్నారో తెలియకపోవడం వంటి విషయాలు ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తున్నాయి.

మొదటి వారమే ఇలా ఉండటం వల్ల, ఇప్పటికే బిగ్ బాస్‌పై చిన్నపాటి అసంతృప్తితో ఉన్న ఆడియన్స్ మరింత నిరాశ చెందుతున్నారు. మొదటి వారంలోనే చిరాకు కలిగిస్తే, మరో 100 రోజులు ఎలా కొనసాగిస్తారన్న సందేహం అందరిలో ఉంది.

Updated Date - Sep 15 , 2025 | 12:57 PM