Filmfare Awards 2025: అట్టహాసంగా.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం
ABN , Publish Date - Oct 12 , 2025 | 08:34 PM
70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025లో ‘లాపతా లేడీస్’ ఘన విజయం సాధించింది. బెస్ట్ మూవీతో సహా 13 అవార్డులు గెలుచుకుంది.
70వ ఫిల్మ్‌ఫేర్-2025 అవార్డుల (Filmfare Awards 2025) ప్రధానోత్సవం గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఈకేఏ అరీనా స్టేడియంలో శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారాలోకం అంతా దిగి వచ్చింది. ఈ అవార్డ్స్ లలో ‘లాపతా లేడీస్’ సినిమా సత్తా చాటి బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్‌ప్లే సహా మొత్తం 13 విభాగాల్లో అవార్డులు గెలుచుకుని ఘన విజయం సాధించింది.
ఈ ఉత్సవంలో షారుక్‌ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ హోస్ట్‌లుగా వ్యహరించి అశ్చర్య పరచగా. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, అనన్య పాండే, కృతి నసన్, సిద్దాంత్ చతుర్వేది స్పెషల్ పెర్ఫార్మన్స్ చేయడం విశేషం. ఉత్తమ నటులుగా అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), కార్తీక్ ఆర్యన్ (చందు: ఛాంపియన్) అందుకోగా.. అలియా భట్(జిగ్రా) ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది.