Bhartha Mahasayulaku Wignyapthi: బెల్లా.. బెల్లా.. సాంగ్ మాత్రం అదిరిపోయిందిల్లా

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:10 PM

విజయాలు, అపజయాలను పట్టించుకోని హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Raviteja) ముందు వరుసలో ఉంటాడు. పని చెయ్.. ఫలితం ఆశించకు అన్నట్లు.. సినిమాలు చేసుకుంటూ పోతాడు.

Bhartha Mahasayulaku Wignyapthi

Bhartha Mahasayulaku Wignyapthi: విజయాలు, అపజయాలను పట్టించుకోని హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Raviteja) ముందు వరుసలో ఉంటాడు. పని చెయ్.. ఫలితం ఆశించకు అన్నట్లు.. సినిమాలు చేసుకుంటూ పోతాడు. దాని ఫలితం ఏంటి అనేది తరువాత. మాస్ జాతర (Mass Jathara) సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. కనీసం సినిమా ప్లాప్ అయ్యిందే అని బాధపడింది లేదు రవితేజ.. ఆ తరువాతి రోజే భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi) సినిమా సెట్ లో ప్రత్యక్షయమయ్యాడు. ప్రస్తుతం మాస్ మహారాజా అన్ని ఆశలను ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు.

ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాధన్, డింపుల్ హయతీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్ తాజాగా మొదటి లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

బెల్లా.. బెల్లా.. ఇజా బెల్లా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సాంగ్ కు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, రోహిణి సొరాట్ ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఇక రవితేజ ఎప్పటిలానే ఎంతో ఎనర్జీతో తన మార్క్ స్టెప్స్ తో అదరగొట్టేశాడు. రవితేజను ఆషికా అందం డామినేట్ చేసింది. చిట్టిపొట్టి బట్టల్లో అమ్మడి అందాల ఆరబోత వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సాంగ్ అయితే త్వరగానే చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 01 , 2025 | 05:11 PM