సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: సమంత.. ఓ ప్లానింగ్‌.. ఓ పద్దతి.. చప్పుడు లేకుండా పెళ్లి..

ABN, Publish Date - Dec 02 , 2025 | 01:39 PM

సమంత, దర్శకుడు రాజ్‌ నిడియోరు కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని గ్రహించారు జనాలు. తరచూ ఫొటోలు షేర్‌ చేయడం, కొటేషన్స్‌ పెట్టడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

Samantha

సమంత (Samantha), దర్శకుడు రాజ్‌ నిడిమోరు (Raj nidimoru) కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని గ్రహించారు జనాలు. తరచూ ఫొటోలు షేర్‌ చేయడం, కొటేషన్స్‌ పెట్టడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయినా వీరిద్దరూ ఎక్కడా స్పందించలేదు, ఖండించలేదు. అయితే ఉన్నట్టుండి ఇద్దరు వివాహ బంధంతో ఒకటై ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చారు. డిసెంబర్‌ 1న ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవాలయం పెళ్లి చేసుకుని ఫొటోలు షేర్‌ చేయడం ఇప్పటిదాకా వచ్చిన రూమర్లు నిజమే అని తేలింది. అయితే దీని వెనకున్న కథ వేరని సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. సమంతకు సంబంధించిన పాత ఫొటో ఒకటి బయటకు రావడంతో ఈ చర్చ మొదలైంది. ఆ పాత ఫొటో చూస్తే వీరిద్దరి నిశ్చితార్థం ఇప్పటిది కాదని, ఎప్పుడో జరిగిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. (Samantha secret marriage)



సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న డీటెయిల్‌ ఫ్యాన్స్‌ వదలరు. ఇప్పుడు సమంత పెళ్లి ఫోటోలను జూమ్‌ చేసి మరీ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. పెళ్లిలో సమంత వేలికి ఉన్న ఉంగరం, గతంలో ఆమె పోస్ట్‌ చేసిన ఒక ఫోటోలో కూడా కనిపిస్తోంది. దీంతో ఈ పెళ్లి హఠాత్తుగా జరిగింది కాదని, దీని వెనుక చాలా కాలం నుంచి ప్లానింగ్‌ ఉందని తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న, అంటే వాలెంటైన్స్‌ డేకి సరిగ్గా ఒక రోజు ముందు సమంత ఒక ఫోటో షేర్‌ చేశారు. పింక్‌ కలర్‌ డ్రెస్‌లో నవ్వుతూ ఉన్న ఆ ఫోటోలో ఆమె చేతికి ఒక డైమండ్‌ రింగ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు పెళ్లి ఫోటోల్లో ఉన్న ఉంగరం, అప్పుడు ఆమె వేలికి ఉన్న ఉంగరం ఒక్కటే అని నెటిజన్లు ఆధారాలతో చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పెళ్లి ఇప్పుడు అయింది కానీ ఎంగేజ్‌మెంట్‌ ఎప్పుడో అయిందనే సందేహం కలుగుతోంది. దాదాపు పది నెలల క్రితమే ఉంగరా?ని మార్చుకుని, ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఫొటోలు ఆధారంగా ప్రేమికులు రోజుసందర్భంగానే ఈ ఎంగేజ్మెంట్‌ జరిగి ఉంటుందని, అందుకే ఆ తర్వాత రోజు ఆమె ఆ ఫోటో పెట్టిందని ఫ్యాన్స్‌ లెక్కలేస్తున్నారు. మొదటి నుంచి సమంత రాజ్‌తో రిలేషన్‌ గురించి గోప్యంగానే ఉంచింది.  ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు పాత ఫొటోలు బయటకు రావడంతో ఇంత పెద్ద విషయాన్ని హడావుడి చేయకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. అయితే సినీ పరిశ్రమ మొత్తం షాక్‌ అయ్యేలా సమంత మెయింటైన్‌ చేసిన సీక్రెట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  అయితే ఇప్పుడు సమంత కళ్లల్లో ఆనందం చూసి అభిమానులు కూడా ఆనందిస్తున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 01:51 PM