Vijay Devarakonda: ఓవర్ స్పీడ్.. విజయ్ దేవరకొండ కారుపై ట్రాఫిక్ ఛలాన్లు! ఎన్ని ఉన్నాయంటే
ABN, Publish Date - Oct 07 , 2025 | 09:29 AM
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రయాణిస్తున్న కారు సోమవారం సాయంత్రం మహబూబ్ నగర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రయాణిస్తున్న కారు సోమవారం సాయంత్రం మహబూబ్ నగర్ గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన సురక్షితంగా బయట పడినప్పటికీ కారు మాత్రం బాగా డ్యామేజ్ అయింది. దాంతో ఆయన మరో కారులో హైద్రాబాద్ చేరుకున్నారు. ఈ తర్వాత నేను మంచిగానే ఉన్నా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఓ ప్రకటన సైతం రిలీజ్ చేశారు.
అయితే.. తాజాగా ఈ యాక్సిడెంట్ సందర్భంగా విజయ్ కారు ప్రమాదానికి(car accident) గురవడానికి ముందు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు గురైనట్టు సమాచారం. తొలుత గతంలో ఒక మారు హైదరాబాద్ గచ్చీబౌలిలోని సాకేత లుంబిని అవెన్యూ ప్రాంతంలో సర్వీస్ రోడ్డుపై కారును పార్క్ చేయడంతో పోలీసులు ₹100 ఫైన్ విధించారు.
అయితే అదే కారులో ఆదివారం రోజున పుట్టపర్తికి 114 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న సమయంలో ఉండవల్లి వద్ద స్పీడ్ గన్ ఫోటోలో రికార్డు కావడంతో, ఆయన కారుకు ఓవర్ స్పీడ్ (Overspeed) డ్రైవింగ్ కేసుగా రూ.1,035 జరిమానా విధించారు. తిరిగి పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో సరిగ్గా అక్కడే ఉండవల్లి వద్ద ఈ ఛలాన్ నమోదు కావడం గమనార్హం.
అయితే.. TG e-చలాన్ పోర్టల్‌లో నమోదైన వివరాల ప్రకారం, విజయ్ దేవరకొండ పేరుతో రిజిస్టర్ అయిన ఆ కారు (నంబర్: TG09D6939) పై మొత్తం ₹1,135 ఫైన్‌లు ఉన్నట్లు తేలింది. కారు యాక్సిడెంట్‌కు గురైన నేపథ్యంలో విజయ్ టీం స్పందించి వెంటనే వాటిని చెల్లించడంతో ఇప్పుడు ఆ వాహనంపై ఎలాంటి ఛలాన్లు లేవని చూపిస్తుంది.