Thammudu Trailer: ఉత్కంఠ రేపుతున్న తమ్ముడు ట్రైలర్..
ABN, Publish Date - Jun 11 , 2025 | 05:29 PM
యంగ్ హీరో నితిన్(Nithiin) హీరోగా వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు(Thammudu ).
Thammudu Trailer: యంగ్ హీరో నితిన్(Nithiin) హీరోగా వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు(Thammudu ). దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. లయ(Laya), స్వస్తిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు(Banger From Thammudu) అనే పేరుతో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
అక్క చేత తమ్ముడు అని పిలిపించుకోవడానికి హీరో ఏం చేశాడు అనేది కథగా తెలుస్తోంది. " మీ అక్కను చూసావా.. తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ, క్యారెక్టర్ మాత్రం లూస్ అవ్వలేదు" అంటూ వర్ష బొల్లమ్మ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. అక్కగా లయ కనిపిస్తుంది. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. అక్క ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తమ్ముడు సిద్దమయ్యినట్లు ట్రైలర్ లో చూపించారు. దానికోసం తమ్ముడు ఎన్ని కష్టాలను దాటాడు.. ? ఎంతమంది విలన్స్ తో పోరాడాడు.. ? చివరకు అక్క ఇచ్చిన మాటను నిలబెట్టాడా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Divi Vadthya: మంగ్లీ బర్త్ డే పార్టీపై క్లారిటీ ఇచ్చిన దివి!
ఇప్పటివరకు అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ మీద ఎన్నో సినిమాలు వచ్చి హిట్స్ అందుకున్నాయి. తమ్ముడు ట్రైలర్ తరువాత ఈ సినిమా కూడా హిట్ అయ్యేలానే కనిపిస్తుందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ట్రైలర్ లో చాలా మంచి డైలాగ్స్ ను పొందుపరిచారు. "ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్ధం కాదు.. అదే వైలెన్స్ తో చెప్తే ", " మాట పోయి మనిషి బ్రతికినా.. మనిషి పోయినట్టే లెక్క. మాట బ్రతికి మనిషి పోతే బ్రతికి ఉన్నట్టే లెక్క" లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక చాలాకాలం తరువాత లయ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమెది చాలా పవర్ ఫుల్ పాత్ర అని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ టేకింగ్, హై ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉన్నట్లు ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బి. అంజనీష్ లోక్ నాధ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Updated at - Jun 11 , 2025 | 06:15 PM