సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bandla Ganesh: అల్లు అర‌వింద్‌ను.. ఆడుకున్న బండ్ల గ‌ణేశ్‌! వీడియో వైర‌ల్‌

ABN, Publish Date - Sep 19 , 2025 | 11:04 AM

లిటిల్ హ‌ర్ట్స్ స‌క్సెస్ మీట్‌లో బండ్ల గ‌ణేశ్ నిర్మాత అల్లు అరవింద్‌పై చేసిన వ్యాఖ్య‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Bandla Ganesh comments

ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించడంతో పాటు క‌లెక్ష‌న్ల‌తో రికార్డులు సృష్టించిన చిత్రం లిటిల్ హ‌ర్ట్స్ (Little Hearts). మౌళి (Mouli Tanuj), శివాని (Shivani Nagaram) జంటగా రూపొందిన ఈ సినిమాను 90s వెబ్ సిరీస్‌ ఫేమ్ డైరెక్ట‌ర్ ఆదిత్య హాస‌న్ నిర్మించ‌గా సాయి మార్తాండ్ (Sai Marthand) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కేవ‌లం రూ. 2.50 కోట్ల‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం ఇప్ప‌టికే రూ.32 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించడ‌మే గాక స్టిల్ ఇంకా థియేట‌ర్ల‌లో విజ‌య వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా హైద‌రాబాద్‌లో ఈ చిత్రం స‌క్సెస్ మీట్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), అల్లు అరవింద్ (Allu Aravind), బండ్ల గ‌ణేశ్ andla Ganesh) వంటి ప్ర‌ముఖ‌లు హ‌జ‌రై చిత్ర బృందాన్ని కొనియాడారు. ఈ క్ర‌మంలో బండ్ల గ‌ణేశ్ మాట్లాడుతూ మ‌ధ్య‌లో అల్లు అర‌వింద్‌ను ఉద్దేశించి చెప్పిన మాట‌లు ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి. వాటిని విన్న వారంతా పొగిడాడా లేక తెగిడాడా అంటూనే ఆయ‌న స్పీచ్‌ను అక్క‌డికి వ‌చ్చిన వారు ఎంజాయ్ చేశారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. మౌళీ.. “సినిమా రిలీజ్‌కి ముందు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేసాడు, బండ్ల గణేష్ పొగిడాడు ఇవన్నీ ట్వీట్లు, ఫోటోలు, పొగడ్తలు.. అంతా ఒక మాయ. ఫిల్మ్ ఇండస్ట్రీలో మాఫియా మనల్ని బ్రతకనివ్వదు. కాబట్టి ఎవరిని నమ్మకు, నీ నీ గాజువాక బేస్‌ను మర్చిపోకు. స్టార్ అవ్వాలని కాదు, మంచి నటుడిగా నిలబడాలని మాత్రమే కోరుకుంటున్నాను” అని సూచించారు. “ఈ రంగంలో పొగడ్తలు ఒక్క ఫ్రైడే వరకే ఉంటాయి. వచ్చే వారం ఇంకో హీరో, ఇంకో సినిమా వస్తుంది. కాబట్టి పొగడ్తలకు పొంగిపోవద్దు. ఇండస్ట్రీలో ఎప్పుడూ వాస్తవికంగా ఉండాలి, దురలవాట్లు దూరం పెట్టాలి” అని హెచ్చరించారు.


ఎవరో కొన్ని వందల కోట్లలో ఒకరు ఉంటాడు.. ఒక స్టార్ కమెడియన్‌కు కొడుగ్గా, మెగాస్టార్ బావమరిదిగా, ఐకాన్ స్టార్ తండ్రిగా ఉంటారు. అలా వంద కోట్లలో ఒకరుంటాడు. అందరలా ఉండలేరు. మనందరం కష్టపడాల్సిందే.. తప్పదు. ఆయన ఎప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడు. ఆయన అనుకున్నవారికి అందుబాటులోకి వెళ్తాడు. అదీ జీవితం అంటే. అంత మహర్జాతకుడిని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇకపై చూడను కూడా. జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకున్న అల్లు అరవింద్ ఇక్కడకు రావటం చాలా సంతోషంగా ఉంది.

నాలాంటి వాడొక‌డు నీ వ‌ద్ద‌కు వచ్చి 'మౌళీ గారు.. మీరు ఆరడుగులు ఉన్నారండి, ఎంత పొడుగు ఉందయ్యా నీది అంటారు. మీ ముందు విజయ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారు' అని అంటారు. వాటిని నమ్మవ‌ద్దు. 'నేను ఐదు అడుగుల హైటే.. నేను చంద్రమోహన్ లాగా మంచి నటుడిని కావాల‌ని అనుకో ఇండ‌స్ట్రీని ఏల‌వ‌చ్చు. అప్పట్లో ఓ ఏడాది చిరంజీవికి గ్యాప్ వచ్చింది. అప్పుదే స‌మ‌యంలో శ్రీకాంత్ హీరోగా 'పెళ్లి సందడి' సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టారు. శ్రీకాంత్ ఎక్కడికో వెళ్లిపోయాడు.. అదీ ఇది అన్నారు. ఒక స్టార్ ని మనం ఏం చేయలేం. 100 కోట్లకు ఒక మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి వాళ్లని టచ్ చేయలేం. ప్ర‌తీరోజూ వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే అల్లు అర్జున్‌తో నేను సినిమా తీశా.. దాంతో రాత్రి ప‌డుకునే స‌మ‌యానికి ఈ ప్ర‌పంచంలో బ‌న్నీకి నేను త‌ప్ప మ‌రెవ‌డూ క్లోజ్ కాదు అనుకుంటాం తెల్లారి లేచాకా అంతా కొత్త‌గా ఉంటుంది.. నువ్వు అలాగే ఉండాలి అల్లు అర్జున్‌లా బ‌తుకు టాలెంట్‌నే న‌మ్ముకేకో అంటూ ముగించాడు.


అయితే... ఊహించ‌ని విధంగా బండ్ల గ‌ణేశ్ మాట్లాడిన తీరుకు అక్క‌డి వారంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ముగింపు అనే బ‌ట‌న్ లేని ఇంజిన్‌లా ప‌ది ప‌దిహేను నిమిషాలు మాట్లాడిన ఆయ‌న అల్లు అర‌వింద్ విషయంలో మాట్లాడిన మాట‌లతో బ‌న్నీ వాస్ కాస్త ఇబ్బంది ప‌డిన‌ట్లు అనిపించింది. ఓ సంద‌ర్బంలో అర‌వింద్‌కు సైతం న‌మ‌స్క‌రించి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు ఆయ‌న స్టేజీపైకి వ‌చ్చి అల్లు అర‌వింద్ పుట్టాకే రామ లింగ‌య్య గారు స్టార్ అయ్యారు అంటూ కాస్త క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

అంతేగాక నేను, ఎస్కేఎన్‌, వంశీ, ధీర‌జ్ మేము న‌లుగురం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండ‌డానికి కార‌ణం అరవింద్ గారే కార‌ణం అని ఇర‌వై ఏండ్ల క్రితం వారు మ‌మ్మ‌ల్ని ద‌గ్గ‌ర‌కు తీశార‌ని అన్నారు. మా నుంచి వ‌చ్చే సినిమాల విష‌యంలోనూ అరవింద్ గారు చాలా స్ట్ర‌గుల్‌ తీసుకుంటార‌ని వాటిపై రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తార‌ని చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే ఇప్పుడు బండ్ల‌ గ‌ణేశ్ స్పీచ్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుండ‌గా అల్లు అర‌వింద్‌ను ఓ ఆట ఆడుకున్నాడుగా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:05 AM