సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mowgli: త‌గ్గిన‌ బండి సరోజ్.. బాలయ్యకు జై

ABN, Publish Date - Dec 10 , 2025 | 09:27 AM

'మోగ్లీ' సినిమాలో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ తన స్వరాన్ని మార్చాడు. మొన్న 'అఖండ 2' నిర్మాతలను ఘాటుగా విమర్శించిన సరోజ్... ఇప్పుడు బాలకృష్ణ అభిమానులకు అభినందనలు తెలిపాడు. 'అఖండ 2'తో పాటు తమ సినిమా కూడా చూడమని కోరాడు.

Bandi Saroj Kumar

మల్టీటాలెంటెడ్ పర్సన్ బండి సరోజ్ కుమార్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విశేషంగా నానుతోంది. రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ నిర్మిస్తున్న 'మోగ్లీ'లో అతను విలన్ గా నటించడం మాత్రమే అందుకు కారణం కాదు... ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అతను చేసిన వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్ళే క్రమంలో బండి సరోజ్ కుమార్ సైతం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తనకు దర్శకుడు సందీప్ రాజ్ కు మధ్య ఎలాంటి గొడవులు లేవని క్లారిఫికేషన్ ఇచ్చాడు. అలానే సందీప్ రాజ్ కూడా... సరోజ్ తో తనకు ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పాడు.

ఇక వివాద రహితంగా 'మోగ్లీ' డిసెంబర్ 12న థియేటర్లలో లాండ్ అవుతుందని భావిస్తున్న తరుణంలో 'అఖండ -2' వాయిదా పడటం, అది 12 వస్తుందనే వార్త రావడంతో బండి సరోజ్ కుమార్ తో పాటు దర్శకుడు సందీప్ రాజ్ సైతం తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. సరోజ్ కుమార్ అయితే ఒక అడుగు ముందుకేసి 'అఖండ 2' నిర్మాణ సంస్థ మీద విరుచుకుపడ్డాడు. సినిమా ఇండస్ట్రీని, డిస్ట్రిబ్యూటర్స్ ను, ఎగ్జిబిటర్స్ ను నిద్రలేకుండా చేస్తున్నారని విమర్శించాడు. అలానే సందీప్ రాజ్ సైతం తనంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరని వాపోయాడు.


ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి 'అఖండ 2' నిర్మాతలు తమ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో ఆ రోజున రావాల్సిన సినిమాల నిర్మాతలకు నిద్రలేని రాత్రిగా అది మిగిలిపోయింది. 'సైక్ సిద్ధార్ధ' నిర్మాతలు జనవరి 1న తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా, మిగిలిన వారు కొత్త రిలీజ్ డేట్ విషయంలో మల్లగుల్లలు పడుతున్నారు.


ఇదే సమయంలో సరోజ్ కుమార్ తన టోన్ ను మార్చి చిత్రంగా బాలయ్య బాబు అభిమానులకు తన హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఫ్యాన్స్ విషయంలో తాను ఆనంద పడుతున్నానని, మొత్తానికి బాలయ్య అభిమానులు అనుకున్నది సాధించారని, ఫైర్ చూపించారని కితాబిచ్చాడు. 'మోగ్లీ' రిలీజ్ డేట్ కూడా రీ-కన్ఫర్మేషన్ స్టేజ్ లో ఉందని, బాలయ్య బాబు అభిమానులు తమ సినిమా కూడా చూసి ఆదరించాలని కోరాడు. అలానే బాలకృష్ణ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు. మొత్తానికి 'అఖండ 2' సినిమా విడుదల వాయిదా పడటాన్ని కూడా కొందరు నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు తమ చిత్రాల పంపిణీకి బాగానే వాడుకుంటున్నారని నెటిజన్స్ అంటున్నారు. మరి బండి సరోజ్ కుమార్ కోరినట్టుగా బాలయ్య బాబు అభిమానులు 'మోగ్లీ'ని కూడా వీక్షిస్తారేమో చూడాలి.

Updated Date - Dec 10 , 2025 | 11:31 AM