సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhanda2: బెంగ‌ళూరులో.. బాల‌య్య ప్యాన్స్ ర‌చ్చ‌! థియేట‌ర్‌లో.. అన్న‌దానం.. కారుకు దిష్టి

ABN, Publish Date - Dec 15 , 2025 | 04:20 PM

శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చిన బాల‌కృష్ణ నూత‌న చిత్రం అన్నిచోట్లా అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతోంది.

Akhanda2

శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చిన బాల‌కృష్ణ (Balakrishna) నూత‌న చిత్రం అన్నిచోట్లా అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతోంది. మాస్ యాక్షన్‌తో పాటు డివోషన్ టచ్ తో వచ్చిన తెలుగు నేలపైనే కాదు, అమెరికాలోనూ 'అఖండ-2' తాండవం (Akhanda 2) విజయఢంకా మోగిస్తోంది. డిసెంబర్ 12న రిలీజైన ఈ చిత్రం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోకి తిరుగులేదని నిరూపిస్తూ థియేటర్లను దేవాలయాలుగా మార్చేస్తోంది.

ఇక‌ ఈ మూవీ.. ప్రీమియర్స్ తో కలుపుకుని మొదటి రోజు వరల్డ్ వైడ్ దాదాపు రూ.60 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్ రికార్డును నెలకొల్పింది. మూడు రోజుల్లోనే 179.30 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి 200 మార్క్ వైపు దూసుకెళుతుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఆదివారం స‌క్సెస్ మీట్ సైతం నిర్వ‌మించి సంబురాలు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో.. తెలుగు నాట‌ కాకుండా బెంగ‌ళూరులోని ఓ థియేట‌ర్‌లో బాల‌య్య అభిమానులు ఓ రేంజ్‌లో స‌క్సెస్‌ సెల‌బ్రేట్ చేసుకున్నారు. డ‌ప్పు వాయిద్యాల‌తో తీన్మార్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. అఖండ‌2 సినిమాలో బాల‌య్య వాడిన కారును తీసుకువ‌చ్చి దాని ఎదుట కొబ్బ‌రికాయ‌లు కొట్టి మొక్కు చెల్లించుకు్న‌నారు. ఆ త‌ర్వాత సినిమా చూడ‌డానికి థియేట‌ర్‌కు వ‌చ్చిన వారికి, బ‌య‌టి నుంచి వ‌చ్చిన వారికి కూడా సాయంత్రం వ‌ర‌కు ఆప్ర‌తిహాతంగా అన్న‌దానం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతుండ‌గా.. వీటిని చూసిన వారంతా బాల‌య్య ఫ్యాన్స్‌ అంటే ఇది, అభిమానుల‌లో బాల‌య్యభిమానులు వేరు అంటూ కాల‌ర్తు ఎగ‌రేస్తు పోస్టులు పెడుతున్నారు. మీరూ ఆ వీడియో ఓ లుక్కేయండి.

Updated Date - Dec 15 , 2025 | 04:22 PM