Akhanda 2 Thaandavam: అయ్యా.. అయ్యా.. అఖండ ట్రైలర్ మరో లెవల్ అయ్యా! ఇక ఆగలేమయ్యా
ABN, Publish Date - Nov 21 , 2025 | 08:18 PM
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ తాండవం మరో రెండు వారాల్లో ప్రేక్షకులెదుటకు రానుంది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శీను (Boyapati Sreenu) కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ తాండవం (Akhanda 2 Thaandavam Trailer) మరో రెండు వారాల్లో ప్రేక్షకులెదుటకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్మాల్లో వేగం పెంచిన మేకర్స్ పాన్ ఇండియా లెవల్‌లో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవలే ముంబైలో, విశాఖ పట్నంలలో పాటలు రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా బెంగళూరులో నిర్వహించిన ఈ వెంట్‌లో ట్రైలర్ విడుదల చేసింది.
తాజాగా రిలీజ్ చేఇన ట్రైలర్ చూస్తంటే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతగా ఇంఫాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. అఖండ 1కు కొనసాగింపుగానే ఈ చిత్రం ఉండనున్నట్లు స్పష్టంగా తెలుస్తంది. అలాగే పవర్‌ఫుల్ మాంత్రికుడి గెటప్‌లో ప్రతి నాయకుడిగా ఆది పినిశెట్టి లుక్ స్టన్నింగ్‌గా ఉంది. అలాగే యాక్షన్ సీన్లు, విజువల్స్ మెస్మరైజింగ్ ఉన్నాయి. డైలాగ్స్ కూడా మరో లెవల్‌లో ఉన్నాయి. చూస్తుంటే అఖండను మించి థియేటర్ల వద్ద పెద్ద సంచలనమే సృష్టించేలా నిజంగా అఖండ తాండవం జరగడం ఖాయం అనేలా ట్రైలర్ ఉంది. మీరూ ఓ లుక్కేయండి.