సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Breaking: సినీ ఇండ‌స్ట్రీలో విషాదం.. బ‌ల‌గం న‌టుడు బాబు క‌న్నుమూత‌

ABN, Publish Date - May 25 , 2025 | 10:29 AM

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మ‌రోసారి విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ ప్రముఖ రంగస్థల కళాకారుడు బలగం జి.వి. బాబు కొద్ది సేప‌టి క్రితం మృతి చెందారు.

balagam babu

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మ‌రోసారి విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ ప్రముఖ రంగస్థల కళాకారుడు బలగం (Balagam) చిత్రం ఫేమ్ జి.వి. బాబు (G.V Babu) కొద్ది సేప‌టి క్రితం మృతి చెందారు. బ‌ల‌గం సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజన్నగా నటించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

కొంత కాలంగా మూత్రపిండాల సమస్య (Kidney Disease)తో బాధపడుతున్న గుడిబోయిన బాబు (G.V Babu) వరంగల్ సంరక్ష హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం క‌న్నుమూశారు. ఆయ‌న మరణానికి వరంగల్ జిల్లా కళాకారుల ఐక్యవేదిక బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇటీవ‌ల జి.వి. బాబు వైద్యం, మందుల కొనుగోలుకు సైతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు ఎవ‌రైనా సాయం చేయాల‌ని బాధిత కుటుంబ సభ్యులు, వరంగల్‌ రంగస్థల కళాకారుల సంఘం ప్రతినిధులు ఇటీవ‌ల మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు వేణు కొంత సాయం చేసిన‌ట్లు స‌మాచారం.

నిన్న (శ‌నివారం) కృష్ణ సినిమా విల‌న్ పాత్ర‌ధారి ముకుల్ దేవ్ మ‌ర‌ణించ‌గా ఆ విష‌యం మ‌రువ‌క ముందే ఇప్పుడు మ‌రో న‌టుడు మృతితో టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు, నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా జీవీ బాబు మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Updated Date - May 25 , 2025 | 10:41 AM