Bakasura Restaurant: చిన్న సినిమా.. ఓటీటీలో అదరగొడుతుందిగా
ABN, Publish Date - Sep 13 , 2025 | 08:16 PM
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మంచి ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడాఓటీటీలో తమ సత్తా చాటుతున్నాయి.
Bakasura Restaurant: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మంచి ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడాఓటీటీలో తమ సత్తా చాటుతున్నాయి. తాజాగా మరో చిన్న సినిమా ఓటీటీలో అదరగొడుతుంది. అదే బకాసుర రెస్టారెంట్ (Bakasura Restaurant). కమెడియన్ ప్రవీణ్ (Praveen) లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో హర్ష చెముడు, గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్ జె శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించారు .
హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన బకాసుర రెస్టారెంట్ సినిమా ఆగస్టు 8 న రిలీజ్ అయ్యి అంత ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో నెల తిరక్కుండానే ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఇక ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సోమవారం నుంచి బకాసుర సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో అంతగా అలరించకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. శుక్రవారం సినిమాలు రిలీజ్ అయినా కూడా బకాసురనే టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం. టాప్ 10 లిస్ట్ లో టాప్ 6 లో బకాసుర రెస్టారెంట్ కొనసాగుతోంది. అమెజాన్ లోనే కాకుండా సన్ నెక్స్ట్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
బకాసుర రెస్టారెంట్ కథ విషయానికొస్తే.. పరమేశ్ (ప్రవీణ్) హైదరాబాద్ లో నలుగురుఫ్రెండ్స్ తో కలిసి జాబ్ చేస్తుంటాడు. అతడికి ఒక రెస్టారెంట్ పెట్టాలని కోరిక. కానీ, కొన్ని కారణాల వలన అది కుదరక నచ్చకపోయినా ఉద్యోగం చేస్తూ.. ఘోస్ట్ రైడర్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ను నడుపుతూ ఉంటాడు. అలా ఒకసారి వీరందరూ కలిసి ఒక బంగ్లాలో వీడియో చేస్తుంటే వారికి ఒక పుస్తకం దొరుకుతుంది. అందులో ఉన్న ప్రయోగాలు చేస్తుండగా కొన్నేళ్ల క్రితం చనిపోయిన బక్క సూరి అలియాస్ బకాసురుడు (వైవా హర్ష) ఆత్మ నిద్రలేస్తుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ ఆత్మ బయటకు రావడానికి కారణం ఏంటి? రెస్టారెంట్ పెట్టాలనే పరమేశ్ కల నేరవేరిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.