సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bakassura: వినోదం పంచే బకాసుర

ABN, Publish Date - Jul 07 , 2025 | 02:55 AM

నటుడు ప్రవీణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. వైవా హర్ష టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఎస్‌జే శివ దర్శకుడిగా...

నటుడు ప్రవీణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. వైవా హర్ష టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా టైటిల్‌ ర్యాప్‌సాంగ్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా యూనిట్‌ విడుదల చేసింది. ఈ గీతాన్ని వికాస్‌ బడిస స్వరపరిచారు. ఈ సందర్భంగా ఎస్‌జే శివ మాట్లాడుతూ ‘‘బకాసుర రెస్టారెంట్‌’లో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు థ్రిల్‌ను ఇస్తుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తాండ్‌ కే. వెంకటేశ్‌

Updated Date - Jul 07 , 2025 | 02:56 AM