Bahubali: The Epic: బాహుబలి: ది ఎపిక్ ఓటీటీలో ఎప్పుడు.. ఎక్కడా
ABN, Publish Date - Dec 24 , 2025 | 11:39 AM
‘బాహుబలి' రెండు భాగాల్లో సుమారు 90 నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించి ‘బాహుబలి: ది ఎపిక్’ (Bahubali: the epic)టైటిల్ తో అక్టోబర్ 31న రిలీజ్ చేసారు. ఈ చిత్రం ఓటీటీ లో విడుదల కానుంది]
ప్రభాస్(Prabhas), అనుష్క కీలక పాత్రధారులుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘బాహుబలి'. రెండు భాగాలుగా రూపొంది ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సంగతి తెలిసిందే. రెండు భాగాల్లో సుమారు 90 నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించి ‘బాహుబలి: ది ఎపిక్’ (Bahubali: the epic)టైటిల్ తో అక్టోబర్ 31న రిలీజ్ చేసారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అవంతిక లవ్‌స్టోరీ ని రాజమౌళి మాటల్లో చెప్పేసి, పచ్చ బొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్, కన్నా నిదురించరా సాంగ్, యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించి ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలో వీటిని జత చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిమానూలు కూడా అదే కోరుకుంటున్నారు. బాహుబలి రెండు భాగాలూ రికార్డుల్లో చరిత్ర సృష్టించిన సంగతి తెల్సిందే. రీరిలీజ్‌లోనూ అత్యధిక ఓపెనింగ్స్ సాధించి సత్తా చాటింది. మొదటిరోజు దేశవ్యాప్తంగా రూ.9.25 కోట్లు వసూలుచేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.18 కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్.