Nagasourya: టెక్నికల్లీ హై గా బ్యాడ్ బాయ్ కార్తీక్...

ABN, Publish Date - May 12 , 2025 | 02:53 PM

నాగశౌర్య గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అతనితో శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రం షూటింగ్ పూర్తయ్యింది.

హీరో నాగశౌర్య (Nagasourya) చేస్తున్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్' (Bad Boy Karthik). ఈ మూవీకి మంచి సాంకేతిక నిపుణుల సహకారం లభిస్తోంది. రసూల్ ఎల్లోర్ (Rasool Ellor) సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ (Harris Jayaraj) స్వరాలు సమకూర్చుతున్నాడు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి కూర్పరిగా వ్యవహరిస్తున్నారు.


'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీలో విధి (Vidhi) హీరోయిన్ కాగా రామ్ దేశినా (రమేశ్‌) డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నాగశౌర్య ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చిందని, క్యారెక్టర్ లోని ఇంటెన్స్ నేచర్ ను అది ప్రెజెంట్ చేసిందని మేకర్స్ తెలిపారు. అతి త్వరలోనే దీనిని రిలీజ్ ను డేట్ ను ప్రకటిస్తామని నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి (Srinivasarao Chinthalapudi) చెప్పారు. సముతిర ఖని, నరేశ్‌ విజయకృష్ణ, సాయికుమార్, 'వెన్నెల' కిశోర్, మైమ్ గోపీ, శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar) తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్ ఇందులోని పాటలను రాయగా, రాజు సుందరం, శోభి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్ వాటికి నృత్యరీతులు సమకూర్చారు.

Also Read: Tollywood: వైభవంగా థియేటర్లలోకి....

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 12 , 2025 | 02:55 PM