Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. రెండు ఇంటర్వెల్స్..?
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:41 PM
ఒకప్పుడు సినిమాల రన్ టైమ్ కచ్చితంగా 3 గంటలు దాటి ఉండేది. కానీ, ఇప్పుడు అంత సమయం ఎవరూ థియేటర్ లో కూర్చోలేకపోతున్నారు.
Bahubali The Epic: ఒకప్పుడు సినిమాల రన్ టైమ్ కచ్చితంగా 3 గంటలు దాటి ఉండేది. కానీ, ఇప్పుడు అంత సమయం ఎవరూ థియేటర్ లో కూర్చోలేకపోతున్నారు. అందుకే ఇప్పడూ సినిమాల రన్ టైమ్ కేవలం 2 గంటలు.. బాగా ఎక్కువ అంటే 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంత చిన్న సినిమా కూడా నచ్చకపోతే అస్సలు కూర్చోలేకపోతున్నారు ప్రేక్షకులను. బోర్, ల్యాగ్ అంటూ చెప్పుకొస్తున్నారు.
ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. దర్శక ధీరుడు జక్కన్న ఇండస్ట్రీలో మరో ట్రెండ్ సెట్ చేయడానికి సిద్దమవుతున్నాడు. రీ రిలీజ్ సినిమాను కొత్త రిలీజ్ చేస్తూ హైప్ సృష్టిస్తున్నాడు. రాజమౌళి క్రియేట్ చేసిన బాహుబలి రెండు పార్ట్స్ ను ఒక్కటిగా మార్చి బాహుబలి ది ఎపిక్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అక్టోబర్ 31 న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
ఇప్పటికే బాహుబలి ది ఎపిక్ మీద అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నిసార్లు టీవీ లో చూసినా కూడా ఆ కళాఖండాన్ని థియేటర్ లో చూడడానికి అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా బాహుబలి ది ఎపిక్ యూ / ఏ సర్టిఫికెట్ ను అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా రన్ టైమ్ అక్షరాలా 3 గంటల 44 నిమిషాలు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు.
ఇప్పుడు ఈ నిడివే సినిమాకు సమస్యగా మారింది. అంతసేపు జక్కన్న ప్రేక్షకులను కూర్చోబెట్టగలడా.. ? కొత్త సినిమా అయితే తరువాత ఏం జరుగుతుందో అనే ఆసక్తితో టైమ్ ని పట్టించుకోరు. ఇది ఆల్రెడీ తెలిసిన కథ. అందులో సగం సగం కట్ చేస్తూ వచ్చిన కథ. తెల్సిన కథను అంతసేపు కూర్చొని ప్రేక్షకుడు చూసేలా చేయగలడా.. ? అంటే చేయొచ్చు. ఎందుకంటే రెండు పార్ట్స్ ని ఎక్కడ కట్ చేసి ఎక్కడ కొత్త సీన్స్ పెట్టాడు అనేది తెలియదు. మొదటి నుంచి ఈ సినిమాను ఎలా చూపించబోతున్నాడు అనేది కూడా తెలియదు కాబట్టి ఆ ఆసక్తితో అయినా చూసే ఛాన్స్ ఉంది.
ఇక ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.. ఇంత సమయం అంటే రెండు విరామాలు ఇస్తాడా.. ? 20 నిమిషాలు తక్కువ నాలుగు గంటలు. మల్టిఫ్లెక్స్ లో అయితే యాడ్స్ తో 10 నిమిషాలు పోతుంది. అంతసేపు సీట్ లో ప్రేక్షకులు కూర్చోలేరు. అలాంటప్పుడు రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాలి. ఇలా రెండు విరామాలు ఇవ్వడం ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. బాలీవుడ్ లో రాజ్ కపూర్ నటించిన సంఘం (1964), మేరా నామ్ జోకర్(1970) సినిమాలకు థియేటర్ లో రెండు ఇంటర్వెల్స్ ఇచ్చారు. ఇక బాహుబలి ది ఎపిక్ కూడా అలాగే ఇస్తారా.. ? అనేది తెలియాలి. అలా ఇస్తే కనుక ప్రేక్షకులు కొద్దిగా రిలాక్స్డ్ గా చూసిన ఫీల్ వస్తుంది అనేది కొందరి భావన. మరి జక్కన్న ఏం చేస్తాడో చూడాలి.
Saturday TV Movies: శనివారం, Oct 18.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Aditya Music: కారులోనూ డాల్బీ క్వాలిటీతో సాంగ్స్...