సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Murali Mohan - Athadu: అతడు రీ రిలీజ్‌.. ఈసారి పక్కా హిట్‌..

ABN, Publish Date - Jul 26 , 2025 | 02:26 PM

‘అతడు’ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి 4కె రిజల్యూషన్‌లో మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న రీ రిలీజ్‌ చేయనున్నారు.

Athadu Re Release

మహేశ్‌బాబు(Mahesh), త్రివిక్రమ్‌ ((Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘అతడు’ (Athadu). త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని జయభేరి ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌ 10న విడుదలైంది. ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసి 4కె రిజల్యూషన్‌లో మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న రీ రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత మురళీమోహన్‌ మాట్లాడుతూ ‘త్రివిక్రమ్‌ని దర్శకుడిగా మేమే పరిచయం చేయాలనుకున్నాం. కానీ తాను స్రవంతి రవికిషోర్‌కు తొలి సినిమా చేస్తానని మాటిచ్చినట్లు చెప్పారు. దాంతో ఆ అవకాశం రవికిశోర్‌కే దక్కింది. అతను కథను మూడు గంటలపాటు చాలా డిటైల్‌గా వివరించాడు. హీరో క్యారెక్టర్‌ కాస్త నెగటివ్‌గా ఉంటుందంటే నేను అంగీకరించలేదు. కానీ త్రివిక్రమ్‌ నన్ను కన్వెన్స్‌ చేసిన ఒప్పించాడు. అలా సినిమా మొదలైంది. మేము ఎవరం కల్పించుకోకుండా పూర్తి బాధ్యతలు త్రివిక్రమ్‌కే వదిలేశాం. ఈ సినిమా కోసం ఇంటి సెట్‌ వేశాం. క్లైమాక్స్‌ ను 28 రోజులపాటు షూట్‌ చేశాం. అయితే సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో ఎక్కడో కాస్త వెనకబడింది. సినిమాతో లాభాలు రాకపోయినా జయభేరి సంస్థకు గౌరవాన్ని తీసుకువచ్చింది.. అవార్డులు రాబట్టింది. టీవీలో మాత్రం సూపర్‌హిట్‌ అయింది. ఇప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులు ఆ చిత్రాన్ని టీవీల్లో ఎంతగానో ఆదరిస్తారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టు సినిమాను అప్‌ గ్రేడ్‌ చేసి 4కెలో రిలీజ్‌ చేస్తున్నాం. ఇప్పటి జనరేషన్‌ ఆడియన్స్‌ బిగ్‌ స్ర్కీన్‌ మీద ‘అతడు’ సినిమా చూడండి. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈరోజున డైరెక్ట్‌గా సినిమా చూడాలంటే టికెట్‌ రేట్‌.. పార్కింగ్‌ రేట్‌.. పుడ్‌ రేట్‌ ఎక్కువైపోయాయి. అసలు చాలా సినిమాలు రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఆడియన్స్‌ చూసేందుకు ధరలు అందుబాటులో ఉండాలి’ అని అన్నారు.


అతడు సినిమా కోసం వేసిన సెట్‌ కోసం మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం ఇంటె సెట్‌ వేశాం. ఆ తర్వాత చాలామంది దర్శకుడు ఆ సెట్‌లో షూటింగ్‌ చేశారు. అక్కడ చిన్న స్టూడియోలా కడదాం అనుకున్నాం. ఆ సైట్‌లో నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్‌ వెళ్లింది. కట్టలేకపోయాం. ఈ సినిమాలో నాకు వేషం ఇవ్వలేదు. ఆల్బమ్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగనని, వేషాలు ఇవ్వమని అడగనని మా ఆవిడకు మాట ఇచ్చాను. అందుకే అడగలేదు! 'అతడు' తర్వాత మా సంస్థలో సినిమా చేయలేదు. నా సోదరుడు కిశోర్‌ కుమార్తె లాస్‌ ఏంజెల్స్‌లో చదువుపూర్తి చేసుకుని వచ్చింది. తన నిర్మాణంలో ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది కొత్త సినిమా స్టార్ట్‌ చేస్తాం’ అని అన్నారు.

ALSO READ:
Sobhan Babu: బ్లాంక్ చెక్ ఇచ్చినా మహేష్ కు తాతగా చేయను

Pawan Fans in London: మీ రూల్స్‌ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..

Shruti Haasan: ఆ ఫెయిల్యూర్స్‌ నా వల్ల జరగలేదు.. కానీ నింద నాపైనే..

Tanushree Dutta: సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌లా చంపే ప్లాన్‌లో..

Updated Date - Jul 26 , 2025 | 10:41 PM