సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Hindu mythology: భక్తిభావన ఉప్పొంగేలా

ABN, Publish Date - Jul 11 , 2025 | 05:35 AM

పురాణాల్లోని దశావతారాల స్ఫూర్తితో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ పది త్రీడీ యానిమేషన్‌ చిత్రాలను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది

పురాణాల్లోని దశావతారాల స్ఫూర్తితో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ పది త్రీడీ యానిమేషన్‌ చిత్రాలను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వరుసలో వస్తున్న తొలి చిత్రం ‘మహావతార్‌ నరసింహ’. అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో శిల్పా ధావన్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. హిరణ్యకశిప, ప్రహ్లాద, నరసింహ స్వామి పాత్రలను పరిచయం చేస్తూ ట్రైలర్‌ సాగింది. ఈ సందర్భంగా శిల్పా ధావన్‌ మాట్లాడుతూ ‘నరసింహ స్వామి గర్జన ప్రతి హృదయంలో భక్తి భావన ఉప్పొంగేలా చేస్తుంది’ అని అన్నారు. అశ్విన్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రం దృశ్యకావ్యంలా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని చెప్పారు.

Updated Date - Jul 11 , 2025 | 05:35 AM