సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ashmita Karnani: నార్త్ హీరోయిన్స్ కి క్యారెక్టర్ ఉండదన్నాడు

ABN, Publish Date - Jun 22 , 2025 | 05:53 PM

ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం.  ఇక్కడ ఎంతమంది ప్రశంసిస్తారో.. అంతేమంది విమర్శిస్తారు.

Ashmita Karnani

Ashmita Karnani: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం.  ఇక్కడ ఎంతమంది ప్రశంసిస్తారో.. అంతేమంది విమర్శిస్తారు.  ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది మరింత ఎక్కువ ఉంటుంది. సినిమా హీరోయిన్స్ కు మాత్రమే కెరీర్ ప్రారంభంలో చేదు అనుభవాలు ఉంటాయని అనుకుంటే పొరపాటే. సీరియల్ హీరోయిన్స్ కూడా కెరీర్ ప్రారంభంలో పలు చేదు అనుభవాలను చవి చూసారు. చాలామంది సీరియల్ హీరోయిన్స్ ఈ విషయాన్నీ బయటపెట్టారు. తాజాగా మరో నటి తన జీవితంలో  జరిగిన ప్రతి అనుభవాన్ని  చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు అస్మిత కర్ణని (Ashmita Karnani). 


అస్మిత ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.  ఈటీవీలో ప్రసారమయిన తూర్పు పడమర,  పద్మవ్యూహం, చంద్రముఖి, మనసు మమతా లాంటి సీరియల్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున తెచ్చుకుంది అస్మిత. ముఖ్యంగా ఆమెకు పద్మవ్యూహం సీరియల్ మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది.  ఆ గుర్తింపుతో పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన అస్మిత  కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కొరియోగ్రాఫర్ సుధీర్ ను వివాహాం చేసుకొని సెటిల్ అయ్యింది.


పెళ్లి తరువాత అడపాదడపా సీరియల్స్ చేస్తున్న అస్మిత యూట్యూబ్ లో తన పేరుతో ఒక ఛానెల్ ను క్రియేట్ చేసి.. ప్రతిరోజు తన జీవితంలో జరిగే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. హెల్తీ ఫుడ్ దగ్గర నుంచి మేకప్, స్కిన్ కేర్ లాంటి విషయాలపై అవగాహనా పెంచుతూ ఉంటుంది. ఇక తాజాగా అస్మిత.. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మొత్తం కలిపి హర్రర్ స్టోరీస్ అనే టైటిల్ తో యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. 


కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు తన వద్ద పనిచేసిన అసిస్టెంట్స్, ఆర్టిస్ట్స్ తనను ఎలా ఇబ్బందిపెట్టారో చెప్పుకొచ్చింది. ఒక అసిస్టెంట్ తనపై చాలా పోసిసివ్ గా ఉండేవాడని, తన పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకొనేవాడని చెప్పింది. అతనిని పనిలో ఉండి తీసేసినా కూడా తన వెంట పడి మరీ  ఇబ్బంది పెట్టినట్లు ఆమె తెలిపింది. ఇక ఇంకో అసిస్టెంట్ దగ్గర గన్ ఉందని. అతను క్రిమినల్ అయ్యి ఉండొచ్చని చెప్పుకొచ్చింది. 


ఇక ఇండస్ట్రీలో ఉంటున్న హీరోయిన్స్ పై రూమర్స్ రావడం సహజమే. తన విషయంలో కూడా ఒక రూమర్ వచ్చింది. తాను కలిసి పనిచేసిన నటుడితో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయని, ఆ రూమర్స్ ను క్రియేట్  చేసింది కూడా సదురు నటుడే అని చెప్పి షాక్ ఇచ్చింది. అతను ఉంటే  ఏ షోస్ కు కూడా తాను వెళ్ళనని చెప్పడంతో అతను సైలెంట్ అయ్యాడని తెలిపింది. ఇక కొండారు తాను డ్రెస్ చేంజ్ చేసుకొనే సమయంలో తొంగి చూడడం చేసారని, అవి పెద్ద హర్రర్ స్టోరీస్ అని చెప్పుకొచ్చింది. 


అయితే కెరీర్ మొదట్లో ఒక పెద్ద ఆర్టిస్ట్  తనను ముఖం మీదనే తిట్టిన విషయాన్నీ గుర్తుచేసుకుంది అస్మిత. 'మొదటి ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో ఒక పెద్ద ఆర్టిస్ట్ నా ఎదురుగా కూర్చొని ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవాడు.  ఎందుకంటే నేను తెలుగు కాదు కాబట్టి. ఎక్కడి నుంచి వస్తారో, డైలాగ్ చెప్పడం రాదు.. ఏం రాదు.. ఈ నార్త్ ఇండియన్ అమ్మాయిలకు ఏం సెంటిమెంట్స్ ఉండవు. వీళ్లకు క్యారెక్టర్ లేదు ఛీ అంటూ తిట్టేవాడు. అప్పుడు నాకు తెలుగు వచ్చేది కాదు. అయినా ఆయన తిడుతుంటే అర్ధం చేసుకొనేదాన్ని. ఆ తరువాతడైలాగ్స్ చాలా ప్రాక్టీస్ చేసి చెప్పేదాన్ని ' అని చెప్పుకొచ్చింది. 

Tollywood: మిలియన్‌ వ్యూస్‌ మాయాజాలం

Updated Date - Jun 22 , 2025 | 05:53 PM