Vishwambhara: ఆ గందరగోళం ఎందుకనే.. రిలీజ్ ఫిక్స్ చేయలేదట..
ABN , Publish Date - Jun 03 , 2025 | 06:56 PM
చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) రిలీజ్ డేట్ మాత్రం డైలామాలో ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
సినిమాలకు దాదాపుగా సమ్మర్ సీజన్ అయిపోయినట్లే. ఇక దసరా, దీపావళి పండుగలు, ఆపై విడుదలలు మిగిలి ఉన్నాయి. మున్ముందు రావలసిన పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ డేట్లు వచ్చేశాయి. చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) రిలీజ్ డేట్ మాత్రం డైలామాలో ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మహా అయితే నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ బాకీ ఉంది. దాంతో పెద్దగా ఇబ్బంది లేదు. కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావాలంటే సీజీ టీమ్ నుంచి అవుట్ పుట్ బయటకు రావాల్సివుంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ 90 శాతం ఇండోర్‌లోనే జరిగింది.
సినిమా అంతా సీజీ వర్కే. అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్టూడియోలు పని చేస్తున్నాయి. వాటి నుంచి అవుట్ పుట్ వచ్చాకే రిలీజ్ డేట్ ప్రకటించాలని చిరంజీవి నిర్ణయించుకొన్నారట. ఒకసారి సీజీ వర్క్ వచ్చి అది నచ్చక మళ్లీ వెనక్కి పంపి, మళ్లీ రిలీజ్ డేట్ మార్చి.. ఈ రచ్చంతా ఎందుకు? సినిమా మొత్తం చూసుకొన్న తరవాత అప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిద్దాం అని పక్కా ప్రణాళిలతో ఉన్నారట చిరు. యూవీ క్రియేషన్స్ కూడా ఇదే మాటకు కట్టుబడి ఉందని తెలుస్తోంది. జూలై, ఆగస్టు ఈ రెండు నెలలు ‘విశ్వంభర’ రావడానికి అవకాశం ఉంది. 2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా ఎలాగూ ఉంటుంది. వీటి మధ్య నాలుగైదు నెలలైనా గ్యాప్ ఉంటే సరిపోతుంది. అందుకే సినిమా విడుదల విషయంలో టీమ్ కంగారు పడటం లేదని తెలుస్తోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయిక. వశిష్ట మల్లిడి దర్శకుడు. యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.