కొత్త తరహా చిత్రం
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:18 AM
అర్థనారి తెప్ప సముద్రం వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్ అంబటి నటించిన తాజా చిత్రం...
‘అర్థనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్ అంబటి నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. నాగ శివ దర్శకత్వం వహించారు. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివప్రసాద్ నిర్మించారు. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రం టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ ‘శివ నాకు ఈ కథను చెబుతున్నప్పుడు హీరో ఎలివేషన్స్ డైరెక్టర్ పూరి స్టయిల్లో అనిపించేవి’ అని అన్నారు. హీరోయిన్ జెన్నిఫర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నేహా అనే పోలీస్ ఆఫీసర్‌పాత్ర పోషించాను. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. చిత్రదర్శకుడు నాగ శివ మాట్లాడుతూ ‘హీరో అర్జున్ యాక్షన్ సీన్స్‌లో, భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించాడు’ అని తెలిపారు. నిర్మాత శివ ప్రసాద్ మాట్లాడుతూ ‘కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగిస్తుందీ చిత్రం’ అని అన్నారు.