సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anasuya Bharadwaj: అనసూయ  ‘అరి’ డేట్ ఫిక్స్ 

ABN, Publish Date - Oct 03 , 2025 | 08:09 PM

వినోద్ వర్మ(vinod Varma), అనసూయ భరద్వాజ్(Anasuya), సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’ (Ari). 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. 

వినోద్ వర్మ(vinod Varma), అనసూయ భరద్వాజ్(Anasuya), సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’ (Ari). 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక.  ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు. 'పేపర్ బాయ్' ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘అరి’ సినిమాను ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి మెసేజ్ తో ‘అరి’  సినిమాను రూపొందించారు దర్శకుడు జయశంకర్. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ప్రమోషనల్ కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే థియేట్రికల్ గా ‘అరి’ మూవీ ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అని నిర్మాతలు అన్నారు. 

 

Updated Date - Oct 03 , 2025 | 08:09 PM