సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

A.R. Rahman Live: హైద‌రాబాద్‌లో.. రెహమాన్ మ్యూజిక్ లైవ్‌ క‌న్స‌ర్ట్‌! టికెట్ ధ‌ర.. తెలిస్తే షాకే

ABN, Publish Date - Oct 29 , 2025 | 10:10 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ నవంబర్‌ 8న రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగనున్న ‘హైదరాబాద్‌ టాకీస్‌’ కచేరీ ద్వారా మళ్లీ హైదరాబాద్‌ ప్రేక్షకులను అలరించబోతున్నారు. టికెట్ ధరలు, షో వివరాలు ఇక్కడ చూడండి.

A.R. Rahman

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్ (AR Rahman) తన సంగీత విభావరితో మరోసారి హైదరాబాద్‌ ప్రేక్షకులను అలరించబోతున్నారు. ‘హైదరాబాద్‌ టాకీస్‌’ ఆధ్వర్యంలో నవంబరు 8న రామోజీ ఫిలిం సిటీ (Ramoji FilmCity) లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులతో తనకున్న అనుబంధాన్ని రెహ‌మాన్‌ గుర్తు చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాలు చేస్తూ పెరిగాను. ‘ఏ మాయ చేశావే’ మొదలు ఇటీవల రామ్‌ చరణ్‌ సినిమా వరకు ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలు నా కచేరీని గొప్పగా ఆస్వాదిస్తారని భావిస్తున్నా’ అని అన్నారు.

కచేరీలో తన బాణీల గురించి వివరిస్తూ ‘నాకు పాత స్వరాలను అనుసరించే సమయం లేదు. కొత్త అనుభూతి కోసం ‘రోజా’ లాంటి క్లాసిక్స్‌ని డాల్బీ అట్మాస్‌లో రీమిక్స్‌ చేస్తున్నాను. ఇప్పుడు సంగీతం గ్లోబల్‌ అయిపోయింది. ఎవరు ఏ భాషలో ఆస్వాదిస్తున్నారో ఎవరూ చెప్పలేరు. సంగీతంలో కొత్తదనం, స్పష్టత ముఖ్యం. అది ప్రేరేపించే భావోద్వేగం అన్నింటి కంటే మరీ ముఖ్యం’ అని వివరించారు.

కాగా, 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ భారీ కచేరీలో రెహమాన్‌ ప్రేక్షకులను ‘మా తుజే సలామ్‌’ పాటతో ఉర్రూతలూగించారు. మళ్లీ ఇన్నేళ్లకు సంగీత ప్రియులను అలరించబోతున్నారు. అయితే దాదాపు 3 గంట‌ల‌కు ప‌గైఆ సాగ‌నున్న ఈ షో ప్రారంభ టికెట్ ధ‌ర రూ.2400 ఉండ‌గా హ‌య్య‌స్ట్ రూ.30,000 ఉంది. అన్ని వ‌య‌సుల వారికి అనుమ‌తి ఉంది. ఈ టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Oct 29 , 2025 | 10:44 AM