Anushka Shetty: అది అనుష్క రేంజ్ అంటే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలుసా

ABN , Publish Date - Jul 23 , 2025 | 08:55 PM

ఇండస్ట్రీలో మార్కెట్ ను బట్టే పారితోషికాలు ఉంటాయి. ఒక సినిమా హిట్ అయితే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తారు.

Ansuhka Shetty

Anushka Shetty: ఇండస్ట్రీలో మార్కెట్ ను బట్టే పారితోషికాలు ఉంటాయి. ఒక సినిమా హిట్ అయితే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తారు. అది ఎప్పుడో ఒకసారి పరాజయం వచ్చేవరకే. ఒక్కసారి ప్లాప్ రుచి చూశారా.. మళ్లీ పారితోషికం కిందకు దిగిపోతుంది. అందుకే ఇండస్ట్రీలో ఉండేవారు.. పారితోషికాల మీద కాకుండా మార్కెట్ ను పెంచుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అది బావుంటేనే కదా ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే మార్కెట్ తో పనిలేకుండా.. సినిమాలు తీయకపోయినా.. ఇండస్ట్రీలో కనిపించకపోయినా వారి రేంజ్ తగ్గదు. అలాంటివారిలో అనుష్క శెట్టి (Anushka Shetty) ఒకరు.


యోగా టీచర్ అయిన అనుష్క సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. కనీసం యాక్టింగ్ ఎలా చేయాలో కూడా తెలియని అమ్మాయి.. పూరి జగన్నాథ్ దయవలన మొదటి సినిమాతోనే కుర్రకారుకు కునుకు పట్టనివ్వకుండా చేసింది. ఆ తరువాత వరుస సినిమాలతో, స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక స్వీటి లైఫ్ ఛేంజ్ చేసింది అరుంధతి. ఈ సినిమా తరువాత లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. అన్ని భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.


ఇండస్ట్రీలో ప్రయోగాలు అన్ని సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. కానీ, ప్రయత్నించాము అనే సంతృప్తి వస్తే చాలు. అలా ఒక ప్రయోగం చేసి అనుష్క బరువు పెరిగింది. సైజ్ జీరో సినిమా ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఆ సినిమా కోసం పెరిగిన బరువు.. ఇప్పటికీ తగ్గించుకోలేక ఇబ్బంది పడుతుంది స్వీటీ. ఇక అందరిలా అమ్మడికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అలవాటు లేదు. బయటకు వచ్చినా కూడా ఎంతో పద్దతిగా కనిపిస్తుంది. సినిమాల కంటే కూడా వ్యక్తిగతంగానే స్వీటీ ఎక్కువ అభిమానులను సంపాదించుకుంది.


నిశబ్దం సినిమా తరువాత.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన స్వీటీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత మరో రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఘాటీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్ని గ్యాప్ లు వచ్చాయి.. సినిమాలు లేవు.. అమ్మడి రెమ్యూనరేషన్ తక్కువ ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఫామ్ లో లేకపోయినా.. స్వీటీ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే పెరిగింది. ఒకప్పుడు సినిమాకు 3 కోట్లు తీసుకొనే స్వీటీ.. ఇప్పుడు ఒక్కో సినిమాకు 6 కోట్లు తీసుకుంటుందని టాక్. ఘాటీకి కూడా అమ్మడు అంతే ఛార్జ్ చేసిందంట.


అంటే రష్మిక, సాయి పల్లవి లాంటివాళ్లు 10 కోట్లు తీసుకుంటున్నారని అంటున్నారు.. స్వీటీ గొప్పేంటి అని అనొచ్చు. కానీ, ఇన్ని గ్యాప్ ల తరువాత వచ్చినా ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటుంది అంటే అది స్వీటీ రేంజ్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఘాటీ సినిమాతో స్వీటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Pawan Kalyan: అవి బావిలో కప్పలు.. ట్రోలర్స్ కు పవన్ గట్టి కౌంటర్

Rana Daggubati: రానాకు మళ్లీ ఈడీ నోటీసులు

Updated Date - Jul 23 , 2025 | 08:55 PM