సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anushka: మెగా ఛాన్స్.. స్వీటీ ఆ పని చేస్తుందా

ABN, Publish Date - Sep 29 , 2025 | 08:39 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

Anushka

Anushka: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇది కాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు .. పండక్కి వస్తున్నారు అనే సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతుంది. ఇప్పటికే ఈ సినిమా కూడా సగం షూటింగ్ ను ఫినిష్ చేసుకుంది.


ఇక ఈ రెండు కాకుండా చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం మెగా 158. బాబీ కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది అనేసరికి ఫ్యాన్స్ ఈ చిత్రంపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఈసారి బాబీ.. చిరును సరికొత్తగా చూపించనున్నాడని తెలుస్తోంది. చిరునే కాకుండా క్యాస్టింగ్ ను కూడా చాలా ఆచితూచి పెట్టనున్నాడట.


అందుతున్న సమాచారం ప్రకారం మెగా 158 కోసం లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టిని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించని ఏకైక హీరోయిన్ అనుష్క మాత్రమే. స్టాలిన్ లో కూడా చిరుతో ఒక సాంగ్ కు మాత్రమే పరిమితమయ్యింది. ఆ తరువాత వీరిద్దరిని కలిపే డైరెక్టరే రాలేదు. ఇక ఇప్పుడు అవకాశం బాబీ తీసుకున్నాడు. చిరు సరసన కుర్ర హీరోయిన్లు నటిస్తుంటే ... అంతగా నప్పడం లేదు. ఎందుకంటే ఆయన వయస్సు 70.. అలా కనిపించకపోయినా కూడా మనవరాలి వయస్సు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ ఏంటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.


ఇక ఈసారి అలాంటి కామెంట్స్ ఏమి రాకుండా సీనియర్ హీరోయిన్లతోనే చిరు రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు. అనిల్ సినిమాలో చిరు సరసన నయన్ నటిస్తోంది. ఇక ఇప్పుడు ఇందులో అనుష్కను అనుకుంటున్నారని సమాచారం. స్వీటీ సైతం ఎప్పుడెప్పుడు చిరుతో ఒక సినిమా చేయాలా అని ఎదురుచూస్తుంది. నిజం చెప్పాలంటే వీరిది పర్ఫెక్ట్ జోడీ అని చెప్పొచ్చు. కానీ, తన బరువు ఆ కోరికను చంపేస్తూ వస్తుంది. మొన్నీమధ్య వచ్చిన ఘాటీ కూడా స్వీటీ బరువు వలనే ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది అనేది వాస్తవం. చిరు సరసన రొమాన్స్ అంటే స్వీటీ కొద్దిగా అయినా బరువు తగ్గాలి. మరి ఈ ఛాన్స్ కోసం స్వీటీ బరువు తగ్గుతుందా.. ? లేదా.. అవకాశాన్ని వదులుకుంటుందా.. ? అనేది చూడాలి.

Piracy Gang Busted:   పైరసీ ముఠా గుట్టురట్టు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Trump: ట్రంప్‌ నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద షాక్‌

Updated Date - Sep 29 , 2025 | 08:39 PM