Anushka: మా ఇళ్లలో పెళ్లిలకు కూడా వెళ్లడం లేదు..
ABN, Publish Date - Sep 01 , 2025 | 04:53 PM
అనుష్కను రానా దగ్గుబాటి ఫోన్లో ఇంటర్వ్యూ చేశారు. ఘాటీ సినిమా గురించి, ఆమె తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు రాబట్టారు
కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు స్వీటీ అనుష్క శెట్టి (Anushka) . కొంతగ్యాప్ తర్వాత ఆమె నటించిన చిత్రం ‘ఘాటీ’ (Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు కారణాల వల్ల ఈ సినిమా ప్రమోషన్స్‌కు నేరుగా పాల్గొలేకపోయారు అనుష్క. దాంతో ఆఫ్‌లైన్‌లో పాల్గొంటున్నారు. తాజాగా రానా ఆమెతో ఫోన్‌లో ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో అనుష్క ‘ఘాటీ’ సినిమా విశేషాలను పంచుకున్నారు. (Rana Inte)
‘ఆంధ్రా - ఒడిశా బార్డర్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ‘బాహుబలి’, ‘అరుంధతి’ తర్వాత వరుసలో ‘ఘాటీ’ తప్పకుండా ఉంటుంది. ఇందులోని వయోలెన్స్‌ను పక్కన పెడితే ఈ కథ ఇప్పటి సమాజంలోని పరిస్థితులకు కరెక్ట్‌గా సరిపోతుంది. క్రిష్ నాకెప్పుడూ గొప్ప పాత్రలు ఇస్తారు. ‘వేదం’లో సరోజ కూడా చాలా సున్నితమైన క్యారెక్టర్. అందులో నా పాత్రను ఎంతో గొప్పగా చూపించారు. నా సినీ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర అది. ఇప్పుడు ‘ఘాటీ’లో ‘శీలావతి’ కూడా అలాంటి గుర్తింపునే తెస్తుంది. ‘ఇకపై ఇలానే మూడేళ్లకు ఒక సినిమా చేస్తావా నిన్ను కలిసి సుమారు 10 ఏళ్లు అవుతోంది’ అని రానా ప్రశ్నించగా దానికి అనుష్క నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘మంచి స్ర్కిప్ట్‌లు ఎంపిక చేసుకుంటున్నాను. వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలు చేస్తా. అలాగే అందరి ముందుకు కూడా వస్తా. మా ఇళ్లలో జరిగే పెళ్లిలకు కూడా వెళ్లడం లేదు. అందరూ ఎప్పుడు కనిపిస్తావ్ అనడుగుతున్నారు. త్వరలోనే అందరి ముందుకు వస్తాను’ అని అనుష్క చెప్పారు.