ఆమెలోని గొప్ప నటిని చూస్తారు
ABN, Publish Date - Aug 17 , 2025 | 05:54 AM
‘భావోద్వేగాలతో అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం ‘పరదా’. సినిమా చూస్తున్న ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఈ చిత్రం ఒక చర్చకు తావిస్తుంది. జనం మాట్లాడుకునే సినిమా అవుతుంది...
‘భావోద్వేగాలతో అందరికీ కనెక్ట్ అయ్యే చిత్ర ‘పరదా’. సినిమా చూస్తున్న ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఈ చిత్రం ఒక చర్చకు తావిస్తుంది. జనం మాట్లాడుకునే సినిమా అవుతుంది. ఇందులో అనుపమలోని గొప్ప నటిని చూస్తారు’ అని అన్నారు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రఽలో ఆయన తెరకెక్కించిన ‘పరదా’ ఈనెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రవీణ్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకొన్నారు. ‘ఈ కథ వినగానే అనుపమ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను చేయాలని అనుకుంటున్నది ఇలాంటి సినిమానే’ అని చెప్పారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. చిత్రీకరణకు దాదాపు మూడేళ్లు పట్టింది. మనాలి, ధర్మశాల ఇలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాల్లో వందలాది మందితో చిత్రీకరించాం. ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడలేదు. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలనే ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకు చూసిన అనుపమ వేరు ఈ సినిమాలో చూసే అనుపమ వేరు. నిర్మాత సురేశ్ బాబు సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి మాస్ కమర్షియల్ సినిమాలు చూస్తునే పెరిగాను. అలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టం. ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.