Anumana Pakshi: అనుమాన పక్షి.. వచ్చేస్తున్నాడు
ABN, Publish Date - Dec 03 , 2025 | 12:16 PM
రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అనుమాన పక్షి’.
రాగ్ మయూర్ (Ragh Mayur), మెరిన్ ఫిలిప్ (Merin Philip) జంటగా 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ (Vimal Krishna) తెరకెక్కిస్తున్న చిత్రం 'అనుమాన పక్షి (Anumana Pakshi). చిలక ప్రొడక్షన్స్ రాజీవ్ చిలక, రాజేశ్ జర్తి యాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నాడు. తాజాగా సినిమా విడుదల తేదీని వెల్లడిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని. తెలిపారు.
వినోద ప్రధానంగా సాగే ఈ సినిమా విమల్ కృష్ణ మార్క్ స్టైలిష్ గా ఉండనుందని చెప్పారు. రాగ్ మయూర్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని పేర్కొ న్నారు. అతిగా ఆలోచిస్తూ, అతి జాగ్రత్తతో ఉండే ఆయన రోల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, కడుపుబ్బా నవ్వి స్తుందని మేకర్స్ అన్నారు. బ్రహ్మాజీ, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీఓపీ: సునీల్ కుమార్ నామా, సంగీతం: శ్రీచరణ్ పాకాల.