సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ANR 101st Birth Anniversary: డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం రీరిలీజ్! రెండు రాష్ట్రాల్లో టికెట్లు ఫ్రీ

ABN, Publish Date - Sep 19 , 2025 | 07:49 AM

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా ఆయన అజరామర చిత్రాలు డాక్టర్‌ చక్రవర్తి, ప్రేమాభిషేకం 2025 సెప్టెంబర్‌ 20, 21 తేదీలలో ఉచితంగా రీ–రిలీజ్ కానున్నాయి.

ANR 101st Birth Anniversary

తెలుగు సినీ పరిశ్రమకు శాశ్వత చిరునామాగా నిలిచిన నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) (Akkineni Nageswara Rao) 101వ జయంతి (ANR 101st birthday celebrations) సందర్భంగా ఆయన ఎవ‌ర్‌గ్రీన్ హిట్‌ (అజరామర) చిత్రాలు డాక్టర్‌ చక్రవర్తి (DR Chakravarthy), ప్రేమాభిషేకం (Premabhishekam) మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవువుతున్నాయి. ఈ ప్రత్యేకంగా రీ–రిలీజ్ చేస్తూ సెప్టెంబర్‌ 20, 21 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించనున్నారు.

ఈ కార్యక్రమం.. ఏఎన్నార్ నటనను చూస్తూ పెరిగిన ల‌క్ష‌లాది మంది ప్రేక్షకులకు, అభిమానుల‌కు ఇది ఒక అపురూప కానుకగా చెప్పవచ్చు. ఆయన మధురమైన నటనను చూసి పెరిగిన తరం నుంచి, కొత్త తరం వరకు అందరికీ మరిచిపోలేని అనుభూతిని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఉచిత టికెట్ల వివరాలు

ఈ రీ–రిలీజ్‌ టికెట్లు 2025 సెప్టెంబర్‌ 18 నుంచే బుక్‌ మై షోలో ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

ప్రదర్శన కేంద్రాలు

హైదరాబాద్‌ (థియేటర్‌ వివరాలు త్వరలో ప్రకటిస్తారు)

విజయవాడ – స్వర్ణ ప్యాలస్

విశాఖపట్నం – క్రాంతి థియేటర్

ఒంగోలు – కృష్ణ టాకీస్

మరిన్ని నగరాల్లో కూడా ఈ రెండు సినిమాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

ఏఎన్నార్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయాయి. డాక్టర్‌ చక్రవర్తిలోని ఆయన వైద్యుని పాత్ర, ప్రేమాభిషేకంలోని భావోద్వేగపూరిత నటన ఇప్పటికీ అభిమానులను కదిలిస్తూనే ఉంటాయి. ఈ రీ–రిలీజ్‌ ద్వారా అప్రతిహతంగా జ‌రిగిన ఆయన సినీ ప్ర‌యాణాన్ని, చేసిన‌ సేవలను మరోసారి స్మరించుకోవచ్చు.

Updated Date - Sep 19 , 2025 | 09:00 AM