Thalaivan Thalaivii: మరోసారి రూ.100 కోట్ల క్లబ్‌లో.. విజయ్ సేతుపతి
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:01 PM
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మరోసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నాడు.
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మరోసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నాడు. ఇటీవల ఆయన ప్రముఖ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో నిత్యా మీనన్ (Nithya Menon) తో కలిసి నటించిన మూవీ ‘తలైవన్ తలైవి’ (Thalaivan Thalaivii). జూలై 17న తమిళంలో, జూలై 25న సర్ మేడమ్ (Sir Madam) పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
సినిమా రిలీజై దాదాపు నెల కావస్తున్నా తమిళనాట ఇప్పటికీ స్టడీగా కలెక్షన్లు రాబడుతూ రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువయింది. గత 16 రోజుల్లో రూ.89 కోట్ల మేరకు వసూలు చేసింది. మరోవైపు, ఈ చిత్రానికి ఇప్పటికీ థియేటర్ కలెక్షన్లు బాగానే ఉండడంతో ఈ వారాంతానికి రూ.100 కోట్ల కలెక్షన్లు అధిగమించ వచ్చని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ముందు వచ్చిన ఏస్ అనే సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ఇదిలాఉంటే.. గత సంవత్సరం నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెల్సిందే. ఆపై చైనాలోనూ రిలీజైన ఈ చిత్రం అక్కడ రూ. 30 నుంచి 40 కోట్ల వరకు వసూళ్లూ తెచ్చి పెట్టడం విశేషం. అయితే తెలుగులో మాత్రం సరైన ప్రయారం లేక జనానికి చేరు వాలేక పోయింది.