సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి.. మరో సినిమా లాక్‌..

ABN, Publish Date - Nov 24 , 2025 | 12:15 PM

ఈతరం దర్శకుల్లో ఫెయిల్యుర్‌ తెలియని దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi). వినోదం ప్రధానంగా ఆయన సినిమాలుంటాయి.


ఈతరం దర్శకుల్లో ఫెయిల్యుర్‌ తెలియని దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi). వినోదం ప్రధానంగా ఆయన సినిమాలుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది మెగాస్టార్‌ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా ఆయన గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దక్షిణాదిలో భారీ సినిమాలు చేస్తున్న కెవిఎన్‌ ప్రొడక్షన్‌లో (KVN Productions) ఓ సినిమా చేయబోతున్నారని వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లు ఆదివారం అనిల్‌ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్ట్‌ పెట్టడంతో ఈ కాంబోలో సినిమా ఖాయమని క్లియర్‌ అయింది. అయితే ఇందులో హీరో ఎవరు? అనే వివరాలు వెల్లడించలేదు. ఇదే బ్యానర్‌లో చిరంజీవి - బాబీ కొల్లి సినిమా, యష్‌, విజయ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే పవన్‌కల్యాణ్‌, లొకేశ్‌ కనకరాజ్‌ కాంబోలో కూడా ఓ సినిమా ఉంటుందని టాక్‌ నడుస్తోంది.  

Updated Date - Nov 24 , 2025 | 12:53 PM