RAJE VENKATACHCHA: 'ధర్మవరం' పోస్టర్ ఆవిష్కరించిన అనిల్ రావిపూడి
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:56 PM
రాజ్ వేంకటాచ్ఛ (Raje Venkatachcha) హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'ధర్మవరం' (Dharmavaram) . ఈ సినిమాకు కథను కూడా ఆయనే అందించారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను అనిల్ రావిపూడి ఆవిష్కరించారు.
రాజ్ వేంకటాచ్ఛ (Raje Venkatachcha) హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'ధర్మవరం' (Dharmavaram) . ఈ సినిమాకు కథను కూడా ఆయనే అందించారు. సంయోగిత (Sanyogita) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను అజయ్, నవీన్ రెడ్డి, ఏషాన్ ఖాన్ తదితరులు పోషించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మూవీ పోస్టర్ చాలా బాగుందని, ఇది ఓ కొత్త ప్రయత్నంగా కనబడుతోందని, రాజ్ వేంకటాచ్ఛ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాన'ని తెలిపారు. హీరో కమ్ డైరెక్టర్ రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ, 'ధర్మవరం సినిమా నాకు ప్రాణప్రదమైన ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండాలని ఎంతో కష్టపడ్డాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోస్టర్ విడుదల కావడం మాకు ఒక శుభసూచకం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది' అని తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ప్రసాద్, నెరిమెట్ల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజేత కృష్ణ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Peddi : రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. మోత మోగడమే
Also Read: Pushpa 2 Vinayaka: పుష్ప 2.. వినాయకుడు! ఇదెక్కడి అభిమానంరా నాయనా