సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bakasura restaurant: అనిల్ రావిపూడి వదిలిన  'బకాసుర రెస్టారెంట్‌' ర్యాప్‌ సాంగ్‌ 

ABN, Publish Date - Jul 05 , 2025 | 07:22 PM

హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'బకాసుర రెస్టారెంట్‌'లోని బకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు.

కమెడియన్‌ ప్రవీణ్‌ (Praveen) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌' (Bakasura restaurant). వైవా హర్ష (vva Harsha) టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రదారులు.  ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని బకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను  బ్లాక్‌బస్టర్‌ మాస్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ర్యాప్‌ సింగర్‌ రోల్‌ రైడ్‌, వికాస బడిస ఆలపించారు. 

ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ '' బకాసుర రెస్టారెంట్‌ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్‌ నాకు మొదట్నుంచి తెలుసు. ప్రవీణ్‌ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్‌ కావాలి. తొలి చిత్ర దర్శకుడు ఎస్‌జే శివతో పాటు అందరికి ఈ చిత్రం మంచి పేరును తీసుకరావాలి' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ '' హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో చిత్ర విడుదల తేదిని ప్రకటిస్తాం" అన్నారు. 

Updated Date - Jul 05 , 2025 | 07:22 PM