సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anil Ravipudi: సంక్రాంతిలోపు ఒక్కొక్క సర్‌ప్రైజ్‌ చూస్తారు..  

ABN, Publish Date - Aug 22 , 2025 | 03:19 PM

చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్‌ రావిపూడి (Anil ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana ShankaraVaraprasad Garu) అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Mana ShankaraVaraprasad Garu


చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్‌ రావిపూడి (Anil ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana ShankaraVaraprasad Garu) అనే టైటిల్‌ ఖరారు చేశారు. శుక్రవారం చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని టైటిల్‌ను, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు ఆయన నటించిన రౌడీ అల్ల్లుడు, గ్యాంగ్‌ లీడర్‌, ఘరానా మొగుడు సినిమాలంటే చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను. మీరందరూ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో దానికి రెండింతలు ‘మన శంకరవరప్రసాద్‌గారు’లో చూస్తారు. ఈ గ్లింప్స్‌తో సినిమా ఎలా ఉండబోతోందో హింట్‌ ఇచ్చాను. ఆయన పాట, ఆట, మ్యానరిజమ్స్‌, ఫైట్స్‌, లుక్స్‌ను అభిమానించని వారు, ఇమిటేట్‌ చేయనివారూ ఉండరు. ఎక్కడో ఒకచోట ఆయనని అనుకరిస్తూనే ఉంటారు. ఇందులో ఆయన కనిపించిన లుక్‌ ఒరిజినల్‌. వీఎఫ్‌ఎక్స్‌ చాలా తక్కువ వాడాం. ఇందులో 5 శాతం వీఎఫ్‌ఎక్స్‌ కూడా లేవు.

ఈ లుక్‌ కోసం ఎంతో కష్టపడ్డారు. అది నా అదృష్టం. బాస్‌ పండగకు వస్తున్నాడు. పాటలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ అద్భుతంగా కుదిరాయి. ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్‌ను కాస్త మార్చి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అని పెట్టాం. టైటిల్‌ గ్లింప్స్‌ వీడియోకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినందుకు వెంకటేశ్‌కు థాంక్స్‌. ప్రస్తుతానికి ఆయన వాయిస్‌ మాత్రమే విన్నారు. త్వరలోనే ఆయన సినిమాలో ఎంట్రీ ఇవ్వనున్నారు. చిరంజీవి - వెంకటేశ్‌ కాంబో ఎలా ఉంటుందో ఈసారి సంక్రాంతికి సర్‌ప్రైజ్‌తో చూస్తారు. ఒక్కొక్కటిగా ఆ సర్‌ప్రైజ్‌లను రివీల్‌ చేస్తాం. కచ్చితంగా ఈ సినిమా మీ అంచనాలను అందుకుంటుంది’ అన్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు.

ALSO READ: Chiranjeevi: చరిత్రలో చిరస్థాయిగా.. మా గుండెల్లో చిరుస్థాయిగా .. 

Ajay Devgn: 'సు ఫ్రమ్ సో' డైరెక్టర్ తో అజయ్ దేవగన్


Updated Date - Aug 22 , 2025 | 03:38 PM