సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rajasekhar: జోరు పెంచిన యాంగ్రీ హీరో.. ఏకంగా మూడు సినిమాల్లో

ABN, Publish Date - Sep 21 , 2025 | 07:19 PM

యాంగ్రీ హీరో రాజశేఖర్ (Rajasekhar) గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ మధ్యనే నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కనిపించాడు.

Rajasekhar

Rajasekhar: యాంగ్రీ హీరో రాజశేఖర్ (Rajasekhar) గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ మధ్యనే నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా కూడా రాజశేఖర్ కి అంతగా విజయాన్ని అందించలేకపోయింది. అయితే రాజశేఖర్ అనారోగ్య కారణాల వలనే సినిమాలు చేయలేకపోతున్నాడని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన మళ్లీ జోరు పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజశేఖర్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


రాజశేఖర్ ప్రస్తుతం ఒక సినిమాలో హీరోగా.. రెండు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది తమిళ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న లబ్బరు పందు సినిమాను రాజశేఖర్ రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విఆర్ దినేష్ పాత్రలో రాజశేఖర్.. అర్జున్ కళ్యాణ్ పాత్రలో 35 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరో విశ్వదేవ్ రాచకొండ నటిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా హీరోయిన్ గా రాజశేఖర్ కూతురు శివాని నటిస్తుందని అంటున్నారు.


నిజం చెప్పాలంటే ఈ రీమేక్ తో రాజశేఖర్ రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్స్. ఈ మధ్యకాలంలో రీమేక్ లను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. అందరూ కొత్తదానాన్ని కోరుకుంటున్నారు. అందుకే కుర్ర హీరోలు సైతం రీమేక్ లు చేసి చేతులు కాల్చుకొని మాకొద్దు బాబోయ్ అంటున్నారు. అంతెందుకు ఈ ఏడాది వచ్చిన భైరవం కూడా రీమేక్ నే. దాని పరిస్థితి ఏమైంది అనేది అందరికీ తెల్సిందే. అందులోనూ ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి సినిమాను రాజశేఖర్ రీమేక్ చేసి హిట్ అందుకోవాలి అనుకోవడం రిస్క్ అనే చెప్పొచ్చు.


ఇక రీమేక్ కాకుండా రాజశేఖర్ మరో రెండు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. దానికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వినికిడి. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అయితే అది పాజిటివ్ నా.. నెగిటివ్ నా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కాకుండా ఈ మధ్యనే రాజశేఖర్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. శర్వానంద్ - యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా రాజశేఖర్ నటిస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూడు సినిమాల అధికారిక ప్రకటనలు రానున్నాయి. మరి ఈ సినిమాలతో యాంగ్రీ హీరో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

OG Movie: వాషి యో వాషి తెలుగు అర్ధం తెలిసిపోయిందోచ్

థలసేమియా, రక్తదానాల‌పై.. మ‌రింత అవగాహన అవ‌స‌రం

Updated Date - Sep 21 , 2025 | 07:19 PM