SIIMA 2025: పవన్ మాటలకు.. గాల్లో తేలిపోయినట్లైంది..
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:11 PM
దుబాయ్ వేదికగా జరిగిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా- 2025)లోనూ పుష్ప -2 సత్తా చాటింది. ఐదు విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు వరించాయి.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించిన పుష్ప సిరీస్ చిత్రాలు ఎంతగా ప్రేక్షకుల్ని అలరించాయో తెలిసిందే! ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా సాధించింది ఈ చిత్రం. ఉత్తమ నటుడిగా బన్నీకి నేషనల్ అవార్డ్ తీసుకొచ్చింది. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా- 2025)లోనూ సత్తా చాటింది. ఐదు విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి రష్మిక, ఉత్తమ దర్శకుడు సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడు , ఉత్తమ గాయకుడు కేటగిరీల్లో పుష్ప-2కు అవార్డులు వరించాయి.
ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప3: ది ర్యాంపేజ్’ కూడా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు ప్రకటించారు. పుష్ప-2 శుభం కార్డులోనూ క్లారిటీ ఇచ్చారు. అయితే దానిపై ఇప్పటిదాకా మరో అప్‌డేట్ లేదు. అసలు ‘పుష్ప 3’ ఉంటుందా.. ఉండదా అన్న అనుమానాలకు సైమా వేదికగా సుకుమార్ వివరణ ఇచ్చారు. కచ్చితంగా ‘పుష్ప 3’ ఉంటుందయి యాంకర్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. దాంతో బన్నీ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ చిత్రంయుయ కోసం ఎంతో వేచి చూస్తున్నాయని కామెంట్స్ పెడుతున్నారు.
సైమా పురస్కారాలు అందుకున్న తారలు ఏమన్నారంటే..
‘తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఒక పాట షూట్ చేశారు. అది విని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ‘అదరగొట్టావ్.. నీ పాటతో చాలా రోజుల తర్వాత నాలో డ్యాన్స్ చేయాలనే కోరిక కలిగించావ్’ అని అన్నారు. ఆ మాటకు గాల్లో తేలిపోయా’
- దేవి శ్రీ ప్రసాద్
‘నేను ప్రభాస్‌తో చేయనున్న ప్రాజెక్ట్ కోసం అందరూ వేచి ఉండండి. ఆయన డేట్స్ ఇవ్వగానే మొదలు పెట్టేస్తాం. మోక్షజ్ఞతో చేయనున్న సినిమా గురించి నిర్మాతలు ప్రకటించే వరకూ నేను రివీల్ చేయను’
- ప్రశాంత్ వర్మ
‘‘పెద్ది సినిమా 50 శాతం పూర్తయింది. రామ్ చరణ్ అద్భుతంగా చేశారు. ఇప్పటి వరకూ చూడని చరణ్‌ను ఈ సినిమాలో చూస్తారు’
- డిఓపీ రత్నవేలు
‘నన్ను అభిమానించే ప్రేక్షకులే నాకు స్ఫూర్తి. నేను ఇప్పుడిప్పుడే ఇండస్ర్టీలో అడుగులు వేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. కష్టపడి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తానని మాటిస్తున్నా’
-భాగ్యశ్రీ బోర్సే