సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Andhela ravamidhi: ‘స్వర్ణకమలం’ స్ఫూర్తితో ‘అందెల రవమిది’

ABN, Publish Date - Sep 13 , 2025 | 11:01 AM

ఇంద్రాణి  దావలూరి (Indrani Daavaluri) ప్రధాన  పాత్రధారిగా నటిస్తూ.. స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘అందెల రవమిది’

Andhela ravamidhi

ఇంద్రాణి  దావలూరి (Indrani Daavaluri) ప్రధాన  పాత్రధారిగా నటిస్తూ.. స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘అందెల రవమిది’ (Andhela ravamidhi). విక్రమ్‌ కొల్లూరు,  తనికెళ్ల భరణి, ఆదిత్య మేనన్‌  కీలక పాత్రలు పోషించారు. నాట్యమార్గం ప్రొడక్షన్స్‌ పతాకంపై శివ బట్టిప్రోలు సమర్పిస్తు న్నారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో  ప్రీ రిలీజ్ వేడుక  నిర్వహించారు.  కె.ఎస్‌.రామారావు, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల అతిథులుగా హాజరయ్యారు. ఇంద్రాణి దావలూరి మాట్లాడుతూ ‘కె.విశ్వనాథ్‌ గారి సినిమాలంటే నాకెంతో ఇష్టం. ఆయన తీసిన ‘స్వర్ణకమలం’ స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. సంగీతం, నాట్యం ప్రధానంగా సాగే  గొప్ప చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు.

నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘ప్రస్తుతం సినిమా అంటే కమర్షియల్‌ హంగులే అని భావిస్తున్న తరుణంలో  సంప్రదాయ సంగీతం, నాట్యంతో మళ్లీ కళలకు ప్రాణం సి పొసే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా తీసిన ఇంద్రాణిని చూస్తే గర్వంగా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. తప్పకుండా ప్రేక్షకులకు చేరువవుతుందని ఉంది' అన్నారు.

కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ 'ఇంద్రాణికి కళలపై ఉన్న తపనకు అద్దం పడుతుంది  ఈ  ప్రయత్నం, ఎంతో  ఇష్టపడి చేసిన ఈ చిత్రం అందరికి  చేరువ కావల్సిన అవసరం ఉందన్నారు . ఈ కార్యక్రమంలో రాజీవ్, లక్ష్మణ్,   తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 03:16 PM