Andala Rakshasi: రీరిలీజ్ కు సిద్దమైన అందాల రాక్షసి..
ABN, Publish Date - Jun 05 , 2025 | 03:07 PM
జూన్ 6 అనగా రేపు శుక్రవారం ఢీ(Dhee) సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా శ్రీను వైట్ల(Srinu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2007 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
టాలీవుడ్ లో ఏదైనా ట్రెండ్ మొదలయ్యింది అంటే.. అది ఒక పట్టానా ఆగదు. అప్పట్లో అభిమానుల సరదా కోసం పాత సినిమాలను రీరిలీజ్ చేసే ట్రెండ్ మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయో లేదో కానీ, ఏదో ఒక సినిమా రీరిలీజ్ మాత్రం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ రీరిలీజ్ ల వలన కొత్త సినిమాలు కూడా కొద్దిగా వెనక్కి తగ్గుతున్నాయి అంటే ఆశ్చర్యం లేదు.
ఇకపోతే ఈ రెండు వారాల్లో రెండు సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. జూన్ 6 అనగా రేపు శుక్రవారం ఢీ(Dhee) సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా శ్రీను వైట్ల(Srinu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2007 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. జూన్ 27 న కన్నప్ప(Kannappa) రిలీజ్ ఉండగా.. ఆ సినిమాకు హైప్ తెచ్చుకోవడానికి మంచు విష్ణు ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నాడు అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.
ఇక ఈ సినిమా కాకుండా వచ్చే వారం ఇంకో హిట్ సినిమా రీరిలీజ్ కు సిద్దమయ్యింది. అదే అందాల రాక్షసి(Andala Rakshasi). నవీన్ చంద్ర(Naveen Chandra), రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) హీరోలుగా లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 13 న రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సాయి కొర్రపాటి, డైరెక్టర్ రాజమౌళి కలిసి నిర్మించడం విశేషం.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి మొదటి సినిమా కావడంతో.. మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి లవ్ స్టోరీస్ లో అందాల రాక్షసి ఎంతో భిన్నంగా ఉంటుంది. 2012 లో రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా అందాల రాక్షసి మ్యూజిక్ ఆల్బమ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. మరి ఈ సినిమా రీరిలీజ్ లో ఫ్యాన్స్ ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.