Anasuya: శివాజీ.. నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - Dec 24 , 2025 | 08:25 PM
అతివినయం ధూర్త లక్షణమని.. శివాజీ (Sivaji) మీడియా ముందు అలాగే బిహేవ్ చేస్తున్నారని నటి అనసూయ (Anasuya) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Anasuya: అతివినయం ధూర్త లక్షణమని.. శివాజీ (Sivaji) మీడియా ముందు అలాగే బిహేవ్ చేస్తున్నారని నటి అనసూయ (Anasuya) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నటుడు శివాజీ హీరోయిన్ల బట్టల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలపై అనసూయ నిన్న ఒక ఈవెంట్ లో స్పందించింది. శివాజీ ఇన్ సెక్యూరిటీతో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చింది. దానికి శివాజీ రియాక్ట్ అయ్యాడు.. ' నాకేంటి అనసూయ గారు. అసలు మీరెందుకు వచ్చారు ఈ ఇష్యూలోకి.. సమాజంలో ఏదైనా జరిగితే.. నేను మాట్లాడతాను..అనసూయ నాకు ఇన్ సెక్యూరిటీ ఉందన్నారు.ధన్యవాదాలమ్మా.. నాకు మా హీరోయిన్స్ ఇబ్బంది పెడతారనే ఇన్ సెక్యూరిటీ ఉంది. అనసూయ మీ రుణం తీర్చుకుంటానని చెప్పుకొచ్చాడు.
ఇక శివాజీ యాక్షన్ కు అనసూయ సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చింది. అతివినయం ధూర్త లక్షణమని చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పటివరకు నేను ఎవరిని అలా చూడలేదు. ఇప్పుడు శివాజీని చూస్తుంటే నమ్ముతున్నాను. పైకి గట్టిగట్టిగా మాట్లాడేవాళ్ళ కన్నా .. ఇలా సైలెంట్ గా.. అమ్మ, తల్లి, బుజ్జి అని మాట్లాడేవాళ్ళు చాలా డేంజరస్. ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు.. నాకు అనిపించింది నేను చెప్పాను. ఆయన ఒక నార్సిసిస్ట్ గా మాట్లాడుతున్నారు. నార్సిసిస్ట్ అంటే .. చేతకానితనంతో ఎప్పుడు వారు చేయలేనిది ఒకరిపై రుద్దడం. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఇదంతా చేతకానితనం, ఇన్ సెక్యూరిటీ. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్లు ఇలా మాట్లాడతారు.
నేను ఎందుకు మిమ్మల్ని లాగాను అంటే నేను కూడా హీరోయిన్నే. సరే మీరంటున్న హీరోయిన్స్ మిమ్మల్ని అడిగారా.. ఇలా చెప్పమని, మిమ్మల్ని ఇలా బట్టలు వేసుకోమని మేము చెప్తున్నామా.. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలని చెప్పేంత చిన్న పిల్లలం కాదు. మా హక్కులు మాకు తెలుసు. మా ఇష్టాలను మమ్మల్ని జీవించమని వినమ్రతతో అడుగుతున్నాను. నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను. మీకే ఇన్ని తెలివితేటలూ ఉంటే సృష్టికర్తలమైన మేము మాకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు. మేము మీ ప్లేస్ ఎక్కడో చూపించాలి అంటే ఎంతసేపు. మొన్న మీరు మాట్లాడిన టోన్ ఉంది .. అది మీ నిజస్వరూపం. మీకు అంత కన్సర్ట్ ఉంటే.. మీకే దమ్ము, ఆ దైర్యం ఉంటే.. మగవాళ్లకు చెప్పండి. ఒరేయ్ .. అడివి జంతువుల్లా ఆ అమ్మాయి మీద పడతారు. మీ బౌండరీస్ తెలుసుకోండి అని చెప్పండి.
అమ్మాయిలు బట్టలు ఇలా వేసుకోవాలి.. అలా వేసుకోవాలి అని ఎక్కడ రాసి ఉంది. బట్టలు మ్యాటర్ కాదు.. క్యారెక్టర్ అనేది మ్యాటర్. ఆ లెక్కన వస్తే పూర్వంలో జాకెట్ లు కూడా లేవు. మన సనాతనంలో కేవలం చీర కప్పుకొని ఉండేవారు ఆడవారు. అప్పుడు మగవాళ్ళు ఎంత సెల్ఫ్ కంట్రోల్ తో ఉండేవారు. వేరే టాపిక్ ల గురించి మాట్లాడలేదు .. దీని గురించే మాట్లాడుతున్నారు అంటే.. అందులో నాకు అవగాహన లేదు. ఇది నేను ఇండస్ట్రీలో విన్నాను.. చూసాను. మిమ్మల్ని చూసి జాలిపడుతున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.