Ananya Nagalla: తెలుగమ్మాయి థైస్ షో.. అబ్బబ్బా ఏముందిరా బాబు
ABN, Publish Date - Nov 02 , 2025 | 09:18 PM
అందం , అభినయం ఉన్నా కొంతమందికి అదృష్టం కలిసిరాదు. అలాంటివారిలో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు.
Ananya Nagalla: అందం , అభినయం ఉన్నా కొంతమందికి అదృష్టం కలిసిరాదు. అలాంటివారిలో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. అందానికి అందం, అభినయం ఉన్నా కూడా అమ్మడు ఇంకా స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలోనే ఉంది. మల్లేశం, వకీల్ సాబ్ లాంటి హిట్ సినిమాల్లో నటించినా కూడా అనన్యకు ఆశించిన అవకాశాలు దక్కడం లేదనే చెప్పాలి. అయినా కూడా ఈ చిన్నది ఎక్కడా అధైర్య పడకుండా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.
వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా హీరోయిన్, విలన్, సపోర్టివ్ రోల్ ఏదైనా సరే చేస్తూ మంచి ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది. ఇక అభినయం పక్కన పెడితే.. అనన్య అందానికి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఆమె ఫోటోషూట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు రానివ్వకుండా చేయడంలో ఈ తెలుగమ్మాయి మాస్టర్స్ చేసింది అని చెప్పొచ్చు.
తాజాగా అనన్య హాట్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ను షేక్ చేసిందని చెప్పొచ్చు. రెడ్ కలర్ మినీ టైట్ స్కర్ట్ లో అదరగొట్టేసింది. రెడ్ హాట్ మిర్చిలా అమ్మడు అలా నడుచుకుంటూ వస్తుంటే కుర్రాళ్ళ గుండెలు ఆగిపోవడం ఖాయమని కొందరు కామెంట్ చేస్తున్నారు. థైస్ అందాలను ఎరగా వేసి.. చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు అబ్బబ్బా ఏముందిరా బాబు.. హాట్ నెస్ కే బ్రాండ్ అంబాసిడర్ లా అంటూ లైక్స్, షేర్స్ తో వైరల్ చేస్తున్నారు.