Allu Sirish: అల్లు శిరీష్ లవ్‌స్టోరీ.. ఎలా మొదలైందంటే..
ABN, Publish Date - Nov 02 , 2025 | 03:15 PM
అల్లు శిరీష్, నయనిక (Nayanika)తో లవ్‌స్టోరీ ఎలా మొదలైందో శిరీష్ తాజాగా తెలిపారు.
అల్లు వారి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. శిరీష్ (Allu Sirish) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయనిక (Nayanika)తో నిశ్చితార్థం జరిగింది. అయితే తన లవ్‌స్టోరీ ఎలా మొదలైందో శిరీష్ తాజాగా తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. తనకు కాబోయే భార్య.. నటుడు నితిన్ సతీమణి షాలినికి స్నేహితురాలని చెప్పారు. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శిరీష్ తన ప్రేమ ప్రయాణాన్ని చెప్పుకొచ్చారు.
నా ప్రేమ కథ చెప్పాలంటే 2023 అక్టోబరులో వరుణ్- లావణ్యల పెళ్లి సమయానికి వెళ్ళాలి. ఆ సమయంలో నితిన్, షాలిని నూతన జంటకు పార్టీ ఇచ్చారు. ఆ సెలబ్రేషన్స్‌కు షాలిని బెస్ట్‌ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ రోజే నయనికను మొదటిసారి చూశా. రెండేళ్ల తర్వాత మేము ప్రేమలో ఉన్నాం, నిశ్చితార్థం చేసుకున్నాం. మా పరిచయం ఎలా మొదలైందంటూ ఏదో ఒక రోజు మా పిల్లలు అడిగితే ఇదే చెబుతా. నన్ను తమ సర్కిల్‌లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ థాంక్స్’ అని పేర్కొన్నారు.