Allu Arjun: రోహిత్ శర్మతో.. అల్లు శిరీష్ యాడ్! అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే!
ABN, Publish Date - Dec 19 , 2025 | 08:01 AM
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, రితికా సజ్దేహ్‌లతో కలిసి యాడ్‌లో నటించిన అల్లు శిరీష్‌కు సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Shirish) తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో వార్తల్లో నిలిచారు. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma), అతని భార్య రితికా సజ్దేహ్ (Ritika Sajdeh)లతో కలిసి శిరీష్ ఒక యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ప్రకటనపై తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఇన్ స్టాగ్రామ్ (Instagram) స్టోరీలో ఆ యాడ్ వీడియోను షేర్ చేస్తూ..'ఇదొక అద్భుతమైన సర్‌ప్రైజ్! వావ్ సిరి.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఈ టీమ్ అందరికీ నా అభినందనలు. అలాగే రోహిత్ గారు.. మీకు నా ప్రత్యేక గౌరవాలు' అంటూ తన తమ్ముడిని అభినందించారు.
ఇక రోహిత్ శర్మతో కలిసి అల్లు శిరీష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రకటనలో రోహిత్, రితికా, శిరీష్ ల మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్ గా కుదిరిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అల్లు శిరీష్ కెరీర్ లో ఇదొక ప్రత్యేకమైన గుర్తింపుగా నిలవనుందని కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు అల్లు శిరీష్ కు ఒకవైపు వృత్తిపరంగా ఇలాంటి పెద్ద బ్రాండ్ల యాడ్స్ తో బిజీగా ఉండటమే కాకుండా, మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అడుగు వేయబోతున్నారు. కన్ స్ట్రక్షన్ రంగంలో ఉన్న నయనికా రెడ్డి (Nayanika Reddy)తో అక్టోబర్ 31న శిరీష్ నిశ్చితార్థం జరగ్గా.. వివాహం త్వరలోనే కానుంది.
పెళ్లి వేడుకల సందడిలో ఉండగానే, రోహిత్ శర్మ వంటి లెజెండరీ క్రికెటర్‌తో కలిసి నటించే అవకాశం రావడం తనకి చిరస్మరణీయమైన అనుభూతి అని శిరీష్ పేర్కొన్నారు. మొత్తానికి, అటు సినిమాలతోనూ, ఇటు ఇలాంటి భారీ యాడ్స్ తోనూ అల్లు శిరీష్ తన ఉనికిని చాటుకుంటున్నారు.