సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu kanakaratnam: అల్లు అరవింద్‌కు మాతృ వియోగం

ABN, Publish Date - Aug 30 , 2025 | 08:18 AM

అల్లు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది, అల్లు అరవింద్‌ (Allu aravind) తల్లి కనకరత్నమ్మ (Allu Kanakaratnam) ఇక లేరు.

అల్లు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి , అల్లు అరవింద్ (Allu aravind) మాతృమూర్తి తల్లి కనకరత్నమ్మ (Allu Kanakaratnam) ఇక లేరు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృధ్ధాప్యకారణం వల్ల శుక్రవారం అర్థరాత్రి దాటాక 1.45 నిమిషాలకు కన్నుమూశారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆమె పార్థీవదేహం అల్లు అరవింద్‌ ఇంటికి చేరుతుంది. మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు జరగనున్నాయి. రాంచరణ్‌ మైసూర్‌ నుంచి, బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి హైదరాబాద్‌ చేరుకొంటారు.

ఇప్పటికే చిరంజీవి కుటుంబం అల్లు అరవింద్‌ ఇంటికి చేరుకున్నారు. పవన్‌, నాగబాబులు వైజాగ్‌లో జరగనున్న పబ్లిక్‌ మీటింగ్‌లో ఉన్నందున ఆదివారం అల్లు అరవింద్‌ కుటుంబాన్ని కలిసి సంతాపం తెలపనున్నారు. అల్లు కనకరత్నమ్మ మరణ వార్త తెలుసుకున్న అల్లు అరవింద్‌ సన్నిహితులు, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Updated Date - Aug 30 , 2025 | 10:30 AM