సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: నో స్నాక్స్‌.. నో షుగర్‌.. నో సోడా

ABN, Publish Date - Nov 17 , 2025 | 05:16 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, అట్లీ దర్శకత్వంలో ఎఎ26 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun), అట్లీ దర్శకత్వంలో 'AA26' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో దీపికా పడుకోన్‌ (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా గురించి చాలాకాలంగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దాంతో సినీ ప్రియులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌ పేపర్‌ సినిమా గురించి చెప్పకనే చెబుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది దసరా లేదా అంతకుముందే వస్తుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే అల్లు అర్జున్‌ మొబైల్‌ వాల్‌ పేపర్‌పె ఓయుయ డేట్‌ ఇచ్చారు.

అలాగే ‘నో స్నాక్స్‌.. నో షుగర్‌.. నో సోడా’ అని రాసి ఓ డైట్‌ కూడా రాసి ఉంది. దానికి పైన 2026 మార్చి 27 అనే తేదీ ఉంది. చివర్లో అయాన్‌ పేరు ఉంది. దీనిని బట్టి అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసం ఫూర్తిగా డైట్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ అంతర్జాతీయ స్థాయి ట్రైనర్‌ దగ్గర ఫిట్‌నెస్‌ కోసం కసరత్తు చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన సూచన మేరకే స్నాక్స్‌, చక్కెర, సోడాను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ డేట్‌ (27, మార్చి 2026) వరకూ ఇదే డైట్‌ కొనసాగిస్తారని తెలుస్తోంది. ఆ తేదీలోపు షూటింగ్‌ కూడా పూర్తవుతుందని భావిస్తున్నారు.

Updated Date - Nov 17 , 2025 | 05:34 PM